ఏపీ గ్రూపు-1 (2011) ఉద్యోగాల మౌఖిక పరీక్షలకు ఎంపికైన వారిలో 133 మంది పూర్వ అభ్యర్థులే ఉండడం చర్చనీయాంశమైంది. వీరు మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మరికొందరికి అవకాశమే లేకుండా పోయింది. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌, ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గతేడాది వేర్వేరుగా ప్రధాన పరీక్షలు నిర్వహించాయి. మౌఖిక పరీక్షలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ జనవరి నెలలో ప్రకటించింది.


Image result for group1appsc

ఇందులో 2013 నాటి మౌఖిక పరీక్షలకు ఎంపికైన వారి జాబితాలో ఉన్నవారు 133 (606మందికి) మంది ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్ర విభజన దృష్ట్యా 173 పోస్టులు ఏపీపీఎస్సీ పరిధిలోకి వచ్చాయి. అయితే.. 2003 గ్రూప్‌ కేసులో కొన్ని పోస్టులు తగ్గడంతో 151 మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. అందులోనూ ఆరు పోస్టులకు అర్హులు లేకపోవడంతో 145 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఒక్కోపోస్టుకు ఇద్దరుచొప్పున మొత్తం 290 మంది అభ్యర్థులను మౌఖికపరీక్షలకు ఏపీపీఎస్సీ ఎంపిక చేసింది. వీరికి ఫిబ్రవరి 13 నుంచి మార్చి 15 వరకు ఒకే బోర్డు ద్వారా మౌఖిక పరీక్షలు జరగనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: