ఈ నెల 13 నుంచి జరగాల్సిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్1 ఇంటర్వ్యూలు రద్దయ్యాయి. ఈ మేరకు ఏపీపీఎస్సీ అధికారులు ఒక ప్రకటన చేశారు. వెరిఫికేషన్ సమయంలో లోపాల కారణంగా ఈ ఇంటర్వ్యూలను రద్దు చేశామని తెలిపింది. తిరిగి ఇంటర్వ్యూలు నిర్వహించే తేదీలను ప్రకటిస్తామని, ఈ మేరకు అభ్యర్థులకు సమాచారం అందజేస్తామని పేర్కొన్నారు. మరోసారి అర్హుల జాబితాను పరిశీలించిన తర్వాత ఇంటర్వ్యూలను ఎప్పటి నుంచి నిర్వహించేది చెబుతామని ఏపీపీఎస్సీ చైర్మన్‌ పిన్నమనేని ఉదయభాస్కర్‌ చెప్పారు. సాంకేతిక పరమైన కారణాలతోనే గ్రూప్‌-1 ఇంటర్వ్యూలను వాయిదా వేసినట్లు ఆయన పేర్కొన్నారు.


 
కాగా, 2011 గ్రూప్‌-1 సర్వీసెస్‌ ఇంటర్వ్యూ బోర్డులో డిపార్ట్‌మెంటల్‌ రిప్రజెంటేటివ్స్‌గా ఉండేందుకు 16 మంది ప్రభుత్వ అధికారులను పంపేందుకు వీలుగా సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ఉత్తర్వులు జారీచేసింది. ఇందులో ఏడుగురు ఐఏఎస్‌, ఐదుగురు ఐపీఎస్‌, నలుగురు ఐఎ్‌ఫఎస్‌ అధికారులు ఉన్నారు. వీరందరూ ఒకే రోజు ఇంటర్వ్యూ బోర్డులో ఉండరు. వెసులుబాటును బట్టి ఒక్కో రోజు ఒకరు, అంతకంటే ఎక్కువ మంది బోర్డులో ఉంటారు. పారదర్శకత కోసం ఇంటర్వ్యూలను సింగిల్‌ బోర్డు ద్వారానే నిర్వహించాలని ఏపీపీఎస్సీ తాజాగా నిర్ణయించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: