కానిస్టేబుల్ ఫలితాలు ఎట్టకేలకు వెలువడ్డాయి. వివరాలను తెలంగాణ పోలీసు నియామక మండలి వెబ్‌సైట్లో ఉంచారు. ఈ మేరకు తెలంగాణ డీజీపీ అనురాగ్‌శర్మ శుక్రవారం(ఫిబ్రవరి 17) ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి 2015 డిసెంబరు 31వ తేదీన ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రాథమిక, దేహదారుఢ్య పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారిలో 81,070 మంది ప్రధాన పరీక్ష రాయగా వీరిలో ఎంపికైన వారి వివరాలను శుక్రవారం(ఫిబ్రవరి 17) వెల్లడించారు. రిజర్వేషన్ల ప్రకారం ఆయా విభాగాలకు ఉన్న పోస్టులు, దానికి అనుగుణంగా వేర్వేరుగా కటాఫ్‌మార్కులు నిర్ధారించి ఆ మేరకు ఎంపికైన అభ్యర్థుల వివరాలు వెబ్‌సైట్లో ఉంచారు.


Related image

సరైన అభ్యర్థులు లేకపోవడంతో అన్ని విభాగాలలో కలిపి 1171 పోస్టులు మిగిలిపోయాయి. మొత్తం 11,613 పోస్టులకుగాను 10,442 మందిని మాత్రమే ఎంపిక చేశారు. మిగిలిపోయిన పోస్టులను తదుపరి నియామకాలలో కలుపుతారు. అత్యధికంగా సాయుధ విభాగంలో మిగిలిపోయాయి. ఇందులో మొత్తం 4462 పోస్టులకుగాను 3346 మాత్రమే భర్తీ అయ్యాయి. 1116 పోస్టులు మిగిలిపోయాయి. సివిల్, సాయుధ, కమ్యూనికేషన్స్ విభాగంలో 1130 మంది మహిళలు ఎంపిక కావడం గమనార్హం. విభాగాల ప్రకారం ఎంపికైన వారి వివరాలను రిజిస్ట్రేషన్ నంబర్ల వారీగా నియామక మండలి వెబ్‌సైట్లో ఉంచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: