రాష్ట్రంలో 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలను మార్చిలోనే నిర్వహించేందుకు విద్యాశాఖ చర్యలు చేపడుతోంది. కిందటేడాది వరకు మార్చి నెలాఖరు వరకు బోధన చేసి, ఏప్రిల్‌లో పరీక్షలను నిర్వహించి మూడో వారంలో సెలవుల్ని ప్రకటిస్తున్నారు. వేసవి సెలవుల అనంతరం జూన్ రెండో వారంలో పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్నాయి. దీనికి భిన్నంగా ఈ ఏడాది మార్చి 6 నుంచి 20వ తేదీ వరకు వార్షిక పరీక్షలు జరగబోతున్నాయి.


Image result for ap govt

ఈ పరీక్షల అనంతరం 22 పనిదినాలపాటు విద్యార్థులకు బోధన ఎలా చేయాలన్న దానిపై విద్యా శాఖ త్వరలో మార్గదర్శకాల్ని జారీచేయనుంది. వీటిల్లో తరగతి స్థాయికి తగినట్లు లేని విద్యార్థులకు ఎలాంటి బోధన (రెమెడియల్ ప్రోగ్రామ్-సవరణ్మాతక బోధన) చేయాలి, సామర్థాలు కలిగిన విద్యార్థులకు పై తరగతుల గురించి ఎలా బోధన చేయాలన్న (సంసిద్ధత) విషయమై స్పష్టత ఇవ్వనున్నట్లు విద్యాశాఖ వర్గాలు పేర్కొన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: