సివిల్ సర్వీసెస్ ముఖాముఖీలకు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు 120 మంది వరకు ఎంపికైనట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. గత డిసెంబరు 3 నుంచి 9 వరకు సివిల్స్ మెయిన్ పరీక్షలు జరిగాయి. దేశవ్యాప్తంగా 15,445 మంది పరీక్షలు రాశారు. మంగళవారం(ఫిబ్రవరి 21) పొద్దుపోయిన తర్వాత యూపీఎస్సీ ఈ ఫలితాలను విడుదల చేసింది. మొత్తం 1097 ఉద్యోగాలకు గాను 2961 మంది ముఖాముఖీలకు ఎంపికయ్యారు.


Image result for civils

మార్చి 20 నుంచి అభ్యర్థులకు వ్యక్తిత్వ పరీక్షలు జరగనున్నాయి. వీటికి ఏపీ, తెలంగాణ నుంచి సుమారు 120 మంది హాజరుకానున్నారు. ఏటా తెలుగు అభ్యర్థులు 60 మంది వరకు సివిల్ సర్వీసెస్‌లో వివిధ ఉద్యోగాలకు ఎంపికవుతున్నారు. అవగాహన పెరుగుతుండటంతో ఏటేటా ఎంపికయ్యే వారి సంఖ్య పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగానికి ఎంపికైనా ఆశించిన సర్వీసు రాలేదని మళ్లీమళ్లీ పరీక్ష రాసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: