గ్రూపు-2 స్క్రీనింగ్ టెస్ట్ (18/2016) తుది 'కీ'ను ప్రకటించారు. తొలుత ప్రకటించిన 'కీ'లో మూడు ప్రశ్నలను తొలగించారు. 147 మార్కులకు జవాబుపత్రాలను మూల్యాంకనం చేయనున్నారు. ఫలితాలను పది రోజుల్లోగా వెల్లడించే అవకాశం ఉందని ఎపీపీఎస్సీ కార్యదర్శి వైవీఎస్టీ శాయి వెల్లడించారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, అసిస్టెంట్ ఇంజినీర్ తుది 'కీ'లను ప్రకటించారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ తుది 'కీ'లో రెండు ప్రశ్నల జవాబులపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో మరోమారు ఎపీపీఎస్సీ పరిశీలన చేయిస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: