డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్(డీఈడీ) కోర్సులో ప్రవేశానికి నిర్వహించే పరీక్షను ఈసారి మూడు మాధ్యమాల్లో నిర్వహించాలని తెలంగాణ విద్యాశాఖ భావిస్తోంది. వచ్చే విద్యా సంవత్సరానికి డైట్‌సెట్‌ను ఆన్‌లైన్‌లో జరపాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతోపాటు తెలుగు, ఆంగ్ల, ఉర్దూ మాధ్యమంలో ప్రవేశ పరీక్ష జరపడమే కాకుండా ఏ మాధ్యమాన్ని ఎంచుకుంటే అందులోనే ప్రవేశ, వార్షిక పరీక్షలు నిర్వహిస్తారు. ఇప్పటివరకు డీఈడీలో ఆంగ్ల మాధ్యమం లేదు. ఈ మార్పులపై తెలంగాణ పాఠశాల కమిషనరేట్ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపగా ప్రస్తుతం దస్త్రం న్యాయశాఖ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. త్వరలో ఆమోద ముద్ర పడనుందని తెలుస్తోంది.


Image result for dietcet

సర్కారు బడుల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడంతో రాష్ట్రంలోని 10 ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణా సంస్థ(డైట్)ల్లో ఆ మాధ్యమం సెక్షన్లు(50 సీట్లు) ప్రారంభిస్తున్నారు. ప్రైవేట్ కళాశాలలూ ముందుకు వస్తే ప్రస్తుతం ఉన్న తెలుగు మాధ్యమం యూనిట్లను ఆంగ్ల మాధ్యమంలోకి మార్చుకునేందుకు విద్యాశాఖ అనుమతి ఇవ్వనుంది. ఒకవేళ ఆంగ్ల మాధ్యమానికి ప్రత్యేకంగా సెక్షన్ కావాలంటే మళ్లీ జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి(ఎన్‌సీటీఈ) ఆమోదం పొందాల్సి ఉంటుంది. అందుకు సమయం ఎక్కువ పడుతుంది కాబట్టి స్వల్ప సంఖ్యలో ఆంగ్ల మాధ్యమానికి మారడానికి అవకాశం ఉందని అధికారుల అంచనా. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులే ఈ కోర్సులో చేరుతున్నారు. ఉపాధ్యాయ నియామకాల్లో ఆంగ్ల మాధ్యమమే చదవాలన్న నిబంధన లేనందున ప్రైవేట్ కళాశాలల నుంచి స్పందన ఈసారి నామమాత్రంగానే ఉండొచ్చని భావిస్తున్నారు. త్వరలో ఉత్తర్వులు (జీఓ)విడుదలైతే మే 10వ తేదీ నాటికి కళాశాలలకు అనుబంధ గుర్తింపు జారీ చేసి..జులై 1 నుంచి తరగతులు ప్రారంభించాలని అధికారుల ప్రణాళిక.

మరింత సమాచారం తెలుసుకోండి: