తెలంగాణలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర వార్షిక పరీక్షలు ఆదివారం (మార్చి 19)తో పూర్తయ్యాయి. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ప్రధాన గ్రూపుల పరీక్షలు మార్చి 14వ తేదీతో పూర్తికావాల్సి ఉండగా.. 9న జరగాల్సిన ద్వితీయ సంవత్సరం గణితం, జంతుశాస్త్రం, చరిత్ర పరీక్షలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ వల్ల 19వ తేదీకి వాయిదా పడ్డాయి. అవి ఆదివారం(మార్చి 19) ముగిశాయి. కరీంనగర్, కొత్తగూడెం జిల్లాల్లో 8 మంది విద్యార్థులపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి.


Image result for inter exams

పరీక్షలు ముగియడంతో ఎంపీసీ విద్యార్థులు ఇంజినీరింగ్, బైపీసీ విద్యార్థులు వైద్య ప్రవేశ పరీక్షలపై దృష్టి సారించనున్నారు. ఇంటర్ పరీక్షల తర్వాత మొదటి ప్రవేశ పరీక్ష జేఈఈ మెయిన్. ఏప్రిల్ 2న జరిగే ఆఫ్‌లైన్ పరీక్షకు తెలంగాణ నుంచి 70 వేల మంది హాజరుకానున్నారు. ఏప్రిల్ 8, 9వ తేదీల్లో జరిగే ఆన్‌లైన్ పరీక్షలకు మరో 10 వేల మంది వరకు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. బైపీసీ విద్యార్థులు మే 7న జరిగే నీట్‌కు సిద్ధం కానున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: