ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసేందుకు ఉద్దేశించిన డీఎస్‌సీకి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తెలిపారని గురువారం(మార్చి 23) శాసనసభలో విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. టీఎస్‌పీఎస్‌సీ ద్వారా మొత్తం 8,792 టీచర్ పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఈ ఉద్యోగాలను భర్తీ చేయాలని ఈనెల 20వ తేదీనే టీఎస్‌పీఎస్‌సీకి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని వివరించారు. ఇక గురుకులాల్లో 7,306 ఉద్యోగాల భర్తీని కూడా టీఎస్‌పీఎస్‌సీ చేపట్టనుందని తెలిపారు. మొత్తం మీద ఈ విద్యా సంవత్సరమే 16 వేల నుంచి 17 వేల ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. 


Image result for dsc exam

సుప్రీంకోర్టు కేసు నేపథ్యమే కారణమా! సుప్రీంకోర్టులో ఉపాధ్యాయ ఖాళీలు, మౌలిక వసతులు తదితర అంశాలపై కేసు నడుస్తోంది. గత నెల 9వ తేదీన కేసు విచారణకు రాగా ఉపాధ్యాయ నియామకాలకు 371 డి అధికరణం అడ్డంకిపై క్షుణ్నంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. కొద్ది రోజుల క్రితం ఈ అధికరణం అడ్డంకి కాదని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ కేసు శుక్రవారం (మార్చి 24) విచారణకు రానుంది. అడ్డంకులు ఏమీ లేనప్పుడు ఎందుకు భర్తీ చేయడం లేదన్న ప్రశ్న రావచ్చని భావించి భర్తీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: