పాలిటెక్నిక్‌లో ప్రవేశానికి నిర్వహించే టీఎస్ పాలిసెట్ దరఖాస్తు గడువు ఏప్రిల్ 11వ తేదీతో ముగియనుంది. ఏప్రిల్ 9 వరకు దాదాపు 95 వేల మంది దరఖాస్తు చేసినట్లు రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి(ఎస్‌బీటీఈటీ) అధికారులు తెలిపారు. గత ఏడాది 1.29 లక్షల దరఖాస్తులు రాగా.. ఈ దఫా ఆ సంఖ్య 1.40 లక్షలకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్టు వెల్లడించారు. ఏప్రిల్ 22వ తేదీన నిర్వహించే ప్రవేశ పరీక్షకు.. 352 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 


Image result for polycet entrance

హైదరాబాద్ ఈస్టు మేరేడుపల్లిలోని ప్రభుత్వ గృహ విజ్ఞాన శిక్షణ(డొమెస్టిక్ సైన్స్ ట్రైనింగ్) కళాశాలలో హోం సైన్స్ డిప్లొమాలో ప్రవేశం పొందగోరు బాలికలు పాలిసెట్ రాయాల్సి ఉంటుందని ప్రిన్సిపల్ ఎస్.నిర్మలదేవి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విభాగంలో డిప్లొమా పూర్తి చేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో మంచి అవకాశాలు ఉంటాయన్నారు. మరిన్ని వివరాలకు చరవాణిలో (9848078049, 9912342081) సంప్రదించాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: