అభ్యర్థుల ప్రయోజనార్థం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. పరీక్ష రాసే హడావుడిలో అభ్యర్థులు వ్యక్తిగత వివరాల (పేరు, హాల్‌టిక్కెట్ నెంబరు) నమోదులోనే తప్పులు చేస్తున్నందున వారి జవాబుపత్రాలు మూల్యాంకనానికి నోచుకోవడంలేదు. దీంతో అభ్యర్థుల పేరు, హాల్‌టిక్కెట్ నెంబరును ముద్రించిన జవాబుపత్రం (ఓఎంఆర్ పత్రం)ను పరీక్ష కేంద్రాల్లో ఇవ్వనున్నారు. త్వరలో జరగనున్న గ్రూపు-3 పంచాయతీ కార్యదర్శుల రాత పరీక్ష నుంచి ఈ విధానాన్ని అమలుచేసేందుకు ఏపీపీఎస్సీ చర్యలు తీసుకుంటోంది.


Image result for appsc

ఇప్పటివరకు ఈ విధానం ఏపీపీఎస్సీలో లేదు. గ్రూపు-2 ప్రాథమిక పరీక్షను నాలుగు లక్షల మందికిపైగా రాశారు. వీరిలో 12,500 మంది జవాబుపత్రాలు మూల్యాంకనానికి నోచుకోలేదు. వ్యక్తిగత వివరాల నమోదులో అభ్యర్థులు తప్పులు చేయడమే ఇందుకు కారణం. హాల్‌టిక్కెట్ నెంబరును తప్పుగా నమోదుచేయడం, వృత్తాలను సరిగా నింపకపోవడం జరిగింది. కొందరు పరీక్ష కేంద్రం పేరును సైతం తప్పుగా నమోదుచేశారు. దీంతో ఓఎంఆర్ పత్రాల్లోనే వారి వివరాలను ముద్రించాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. గ్రూప్-3 నుంచి అమలుచేసేందుకు చర్యలు మొదలు పెట్టింది. పరీక్ష కేంద్రం పేరును ముద్రించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నారు. అభ్యర్థులు ప్రశ్నపత్రం కోడ్ వరకు నమోదు చేస్తే సరిపోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: