ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర ప‌రీక్షల‌ ఫలితాల్లో కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో ఉండగా, కడప జిల్లా చివరి స్థానంలో నిలిచిందని ఏపీ మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. గురువారం (ఏప్రిల్ 13) విజయవాడలో ఆయన ఇంటర్‌ ఫలితాలను విడుదల చేశారు. ఇంట‌ర్‌ జనరల్‌, వొకేషనల్‌ కోర్సులకు సంబంధించిన అన్ని ఫలితాలను ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 1 నుంచి 19వ తేదీ వరకు ఈ పరీక్షలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఈ ఏడాది 10లక్షల మందికిపైగా పరీక్షలు రాశారు.


Image result for ap inter results

గతేడాది నుంచి ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను కలిపి విడుదల చేస్తున్నాం. ప్రాక్టికల్స్‌లో జంబ్లింగ్‌ విధానం అమలు చేశాం. మాల్‌ ప్రాక్టీసులు కూడా తగ్గాయి. ఈ ఏడాది కేవలం 106 కేసులు నమోదయ్యాయి. విత్‌హెల్డ్‌ అసలు లేవు. స్పాట్‌ వాల్యూయేషన్‌లో పాల్గొన్న వారికి బయోమోట్రిక్‌ వ్యవస్థ ఏర్పాటు చేశాం. వారికి ఆన్‌లైన్‌ ద్వారా చెల్లింపు చేశారు. మే 15నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహిస్తాం.. వచ్చే ఏడాది నుంచి ఇంటర్‌లో గ్రేడింగ్‌ విధానం అమలు చేసే యోచన ఉంది.’ అని గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈ ఏడాది ఇంటర్‌ ఫలితాల్లో అన్ని కేటగిరీల్లో బాలికలదే పైచేయి అని మంత్రి గంటా శ్రీనివాస్‌ తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: