సర్వశిక్షాఅభియాన్‌ జిల్లా ప్రాజెక్టు కార్యాలయాల్లో సెక్టోరల్‌, అసిస్టెంట్‌ సెక్టోరల్‌ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎస్‌ఎస్ఏ ప్రాజెక్టు డైరెక్టర్‌ జి.శ్రీనివాస్‌ తెలిపారు. సెక్టోరల్‌ ఆఫీసర్‌ పోస్టులకు గెజిటెడ్‌ ర్యాంకు, అసిస్టెంట్‌ సెక్టోరల్‌ ఆఫీసర్‌ పోస్టులకు నాన్‌గెజిటెడ్‌ ర్యాంకు ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను సంబంధిత జిల్లా ఎస్‌ఎ్‌సఏ ప్రాజెక్టు అధికారులకు మాత్రమే అందజేయాల్సి ఉంటుందని సూచించారు.


Image result for sarva shiksha abhiyan

అర్హతా ప్రమాణాలు, విద్యార్హతలు, దరఖాస్తు ఫారం టssa.ap.gov.in వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని ఈ నెల 29లోపు అందజేయాలని కోరారు. ఇదిలావుండగా జిల్లా ఎస్‌ఎస్ఏ ప్రాజెక్టులో గెజిటెడ్‌ ర్యాంకు పోస్టులు అయిన సీఎంవో, ఏఎంవో, జీసీడీవో, ప్రత్యామ్నాయ పాఠశాలల కోఆర్డినేటర్‌ ఖాళీలు, నాన్‌గెజిటెడ్‌ ర్యాంకు పోస్టు అయిన అసిస్టెంట్‌ ఆల్టర్నేటివ్‌ స్కూల్స్‌ ఖాళీలను భర్తీ చేస్తారు. ఆన్‌లైన్‌ రాత పరీక్ష 85 మార్కులకు, ఇంటర్వ్యూ 15 మార్కులకు ఉంటుంది. మెరిట్‌ లిస్టు తయారుచేసి జిల్లాల్లో ఆయా ఖాళీలను భర్తీ చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: