తమిళ విద్యార్థి రూపొందించిన 65 గ్రాముల శాటిలైట్‌ను అమెరికాలోని ‘నాసా’ సంస్థ అంతరిక్షంలోకి ప్రయోగించనుంది. కరూరుజిల్లా పల్లపట్టి గ్రామానికి చెందిన మహమ్మద్‌ రీఫాక్‌ షారూక్‌ అనే ప్లస్‌టూ విద్యార్థి ‘స్పేస్‌కిడ్స్‌ ఇండియా’ సంస్థ సహకారంతో లక్ష రూపాయల వ్యయంతో అరచేతిలో ఇమిడిపోయేలా తయారుచేసిన ఈ సబ్‌ ఆర్బిటల్‌ శాటిలైట్‌లో ఆరు సెన్సార్‌లు, సాంకేతిక పరికరాలు ఉన్నాయి. ఈ శాటిలైట్‌ అంతరిక్షంలో 240 నిమిషాలపాటు పనిచేయగలుగుతుంది.



పిట్టకొంచెం కూత ఘనమన్నట్లు ఈ శాటిలైట్‌ పనితీరు అద్భుతమనిపిస్తోంది. ప్రస్తుతం అంతరిక్షంలోకి ప్రయోగించబడిన ఉపగ్రహాలపై ధార్మిక కిరణాల వల్ల కలిగే మార్పులు, అక్కడి పరిస్థితులను పరిశీలించగలుగుతుంది. ఈ శాటిలైట్‌ అంతరిక్షంలో తన పనులు ముగించుకుని సముద్రంలో పడుతుంది. దానిని మళ్లీ ఉపయోగించుకునే వీలుంటుందని మహమ్మద్‌ షారూక్‌ తెలిపాడు. శాటిలైట్‌ల రూపకల్పనపై నాసా సంస్థ నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి పోటీలో పాల్గొనే అవకాశం కూడా లభించిందన్నాడు. ఈ శాటిలైట్‌ను విర్జీనియా రాకెట్‌ దళం నుండి వచ్చే జూనలో ప్రయోగించనున్నారని, ఈ బుల్లి శాటిలైట్‌కు ‘కలామ్‌శాట్‌’ అనే పేరుపెట్టానని వివరించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: