మెడికల్‌ పీజీ విద్యార్థులకు ప్రతి నెల స్టైపెండ్‌ కింద రూ.30 వేలు, డెంటల్‌ పీజీ విద్యార్థులకు రూ.25 వేలు అందించాలని ప్రైవేటు మెడికల్‌ కాలేజీలను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, మూడు రోజుల క్రితం పెంచిన డెంటల్‌ పీజీ ఫీజులను తగ్గిస్తూ మరో ఉత్తర్వు జారీ చేసింది. బుధవారం ఇచ్చిన ఉత్తర్వుల్లో ఏ కేటగిరి సీటు రూ.7.50 లక్షలు, బీ కేటగిరి సీటు రూ.5.50 లక్షలు పెంచుతున్నట్లు ప్రకటించారు.


Image result for ap government

దీనిపై విద్యార్థులు ఆందోళన చేయడంతో.. ప్రభుత్వం ఫీజులను భారీగా తగ్గిస్తూ, కీలక నిర్ణయం తీసుకొంది. క్లినిక్‌ డిగ్రీ ఫీజును రూ.5.50 లక్షలు, నాన్‌ క్లినికల్‌ డిగ్రీ ఫీజును రూ.5.25 లక్షలకు తగ్గించింది. బీ కేటగిరిలో కూడా క్లినికల్‌ సీట్ల ఫీజును రూ.3 లక్షలు తగ్గించి..రూ.10 లక్షలకు పరిమితం చేసింది. మరోవైపు డెంటల్‌ కౌన్సెలింగ్‌కు సంబంధించిన మార్గదర్శకాలను కూడా శనివారం విడుదల చేశారు. దీంతో మంగళవారం నుంచి కౌన్సెలింగ్‌ నిర్వహించాలని వర్సిటీ అధికారులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: