పాఠశాలల హేతుబద్ధీకరణకు రంగం సిద్ధమైంది. ప్రాథమిక స్థాయిలో ఉన్న విద్యార్థులు, స్కూళ్లను విలీనం చేయాలని విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఫలితంగా, రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 4,637 స్కూళ్లు ఇతర పాఠశాలల్లో విలీనం కానున్నాయి. ఆయా స్కూళ్లలోని ఉపాధ్యాయులు, విద్యార్థులను విలీనం చేసిన పాఠశాలలకే తరలిస్తారు. ఈ మేరకు అన్ని చర్యలూ తీసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారులకు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఆదేశాలు జారీ చేశారు.



సర్వశిక్షా అభియాన్‌ ఆడిటోరియంలో మంగళవారం డీఈవోల సమావేశం జరిగింది. రానున్న విద్యా సంవ త్సరంలో అమలు చేయాల్సిన కార్యాచరణ ప్రణాళికపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి కడియం డీఈవోలకు దిశానిర్దేశం చేశారు. జీరో ఎన్‌రోల్‌మెంట్‌, 1 నుంచి 10 మంది విద్యార్థులలోపు, 20 మంది విద్యార్థులలోపు ఉన్న స్కూళ్లను విలీనం చేయాలని, జూన్‌ 12న స్కూళ్లను మళ్లీ తెరిచే నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని, అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మొత్తంగా విలీనం కానున్న 4,637 స్కూళ్లలో 6116 మంది ఉపాధ్యాయులు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: