కొత్తగా ఉపాధ్యాయ విద్యాకోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు విద్యాశాఖ తీపికబురు అందించింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ముందు టెట్‌ నిర్వహించి ఇప్పటి వరకూ టెట్‌ రాయని వారు, రాసినా అర్హత సాధించని వారు కూడా ఉద్యోగాలకు పోటీ పడే అవకాశం కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)కు ఈ నెల 10న నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రకటించారు. బుధవారం టీఎ్‌సపీఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణితో కలిసి సచివాలయం డి బ్లాక్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. చివరిసారిగా 2016 మే లో టెట్‌ పరీక్ష నిర్వహించామని, అప్పటినుంచి ఇప్పటివరకు కొత్తగా బీఈడీ, డీఈడీ పూర్తిచేసిన విద్యార్థులు 26,100 మంది ఉన్నారని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: