పాఠశాల, ఇంటర్‌ స్థాయిలో 90 శాతం పైబడి మార్కులు సాధించిన బ్రాహ్మణ విద్యార్థులకు రూ 10వేలు ఆర్థిక సాయం అందిస్తామని తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత చైర్మన్‌ కేవీ రమణాచారి అన్నారు. డిగ్రీ స్థాయిలో 90శాతం పైబడి మార్కులు సాధించినవారికి రూ 15వేలు, పీజీ స్థాయిలో రూ. 20వేలు, ఇంజనీరింగ్‌ స్థాయిలో రూ. 30వేలు ఇస్తామన్నారు. విదేశాలకు వెళ్లి చదువుకొనే బ్రాహ్మణ విద్యార్థులకు రూ. 20 లక్షలను వివేకానందుని పేరిట గ్రాంట్‌ రూపంలో అందిస్తామని తెలిపారు. హైదరాబాద్‌ రవీంద్రభారతిలో ఆదివారం పరిషత ఆధ్వర్యంలో బ్రాహ్మణ మహిళా సదస్సు జరిగింది. ఈ సందర్భంగా రమణాచారి ఈ వివరాలు తెలిపారు. 18-60 ఏళ్లలోపు బ్రాహ్మణులకు ఉచితంగా రూ.2లక్షల వరకు వైద్య సదుపాయం అందించేందుకు కృషిచేస్తామని తెలిపారు. 60 ఏళ్లు పైబడినవారికి రూ. 3 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం అందించేందుకు నిర్ణయం తీసుకోనున్నామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: