కఠోర దీక్షతో జీవితంలో ఏ రంగంలోనైనా ఉన్నతస్థాయికి చేరుకోవచ్చని ఐఏఎస్‌ ఆల్‌ ఇండి యాథర్డ్‌ ర్యాంకర్‌ కోణంకి గోపాలకృష్ణ పేర్కొన్నారు. ఆల్‌ ఇండియా స్థాయిలో ఐఏఎస్‌ థర్డ్‌ ర్యాంకు సాధించిన గోపాలకృష్ణను రాజానగరంలోని కేఎల్‌ఆర్‌ లెనోరా దంత వైద్య కళాశాలలో మంగళవారం గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈసందర్భంగా ఏర్పాటుచేసిన అభినందన సభలో గోపాలకృష్ణ మాట్లాడుతూ లక్ష్య సాధనలో అపజయాలు ఎదురైనా ఆత్మస్థైర్యంతో ముందు కు సాగితే అనుకున్న రంగంలో ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చన్నారు.


 
మారుమూల గ్రామీణ ప్రాంత నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తాను మూడు పర్యాయాలు వైఫల్యం చెందినప్పటికి నిరాశ చెందకుండా సివిల్స్‌లో తెలుగు భాషను ఐచ్చికంగా ఎంచుకుని ఆల్‌ ఇండియా స్థాయిలో ఐఏఎస్‌ థర్డ్‌ ర్యాంకు సాధించగలిగానన్నారు. పేదరికం నుంచి వచ్చిన తాను తొలుత టీటీసీ శిక్షణ పొంది ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా ఉద్యోగ విధులు నిర్వహిస్తూ సివిల్స్‌లో ఉత్తీర్థత సాధించానన్నారు. తన జీవితంలో తనకు ఎదురైన వైఫల్యాలు మరపురాని అనుభవాలు నేర్పించాయన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: