దేశంలో పరిశోధనా రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని, దేశ వ్యాప్తంగా 20 విద్యాసంస్థలకు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను సమకూరుస్తామని కేంద్ర మానవ వననరుల అభివృద్ధి మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ అభిప్రాయపడ్డారు. బెంగళూరులో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సె్‌సలోని సెంటర్‌ ఫర్‌ నానో సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ విభాగాన్ని మంత్రి శనివారం సందర్శించారు. అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ లాంటి సంస్థలకు ఆర్థికమైన ఇబ్బంది ఉండదని చెప్పారు. ప్రపంచస్థాయిలో మౌలిక సదుపాయాలను కల్పిస్తే పరిశోధకులకు మరింత అనువుగా ఉంటుందని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. జీఎస్టీ విద్య, వైద్య రంగంతోపాటు పరిశోధనలకు మరింత అనుకూలం కానున్నదని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: