నిరుద్యోగ అభ్యర్థులు స్వయం ఉపాధి రుణాలు పొందేందుకు ప్రధానమంత్రి ఉపాధి కల్పనా పథకం కింద 2017-18 గాను దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని పరిశ్రమల శాఖ జిల్లా జనరల్‌ మేనేజర్‌ కే. తుల్బ్యనాయక్‌ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పథకం ఖాదీ కమిషన్‌ ద్వారా అమలు చే స్తున్నామని చెప్పారు. ఆసక్తిగల అభ్యర్థులు సొంతంగా యూనిట్లు ఏ ర్పాటు చేసుకునేలా ప్రోత్సాహం అందిస్తామన్నారు. ఈనెల 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. పాస్‌ఫోటో, విద్యార్హత సర్టిఫికెట్‌, కులధ్రువీకరణ పత్రం, స్థాపించబోయే పరిశ్రమ ప్రాజెక్ట్‌ రిపోర్టును సి ద్ధం చేసుకోవాలని ఆయన సూచించారు. వివరాలకు ఆర్టీసీ క్రాస్‌ రో డ్డులోని జిల్లా పరిశ్రమల కార్యాలయాన్ని సంప్రదించొచ్చని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: