కినాడ నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు టీసీఎస్‌ సంస్ధ బీపీఎస్‌ (బిజినెస్‌ ప్రొసెస్‌ సర్వీసు)లో నైపుణ్యం కోసం నెల పాటు వికాస, కార్పొరేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నట్టు వికాస పీడీ వీఎన్‌ రావు తెలిపారు. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, ఆటిట్యూడ్‌ డెవలప్‌మెంట్‌, అనలిటికల్‌, లాజికల్‌ రీజనింగ్‌, కంప్యూటర్‌ బేసిక్స్‌లో శిక్షణ ఇస్తారన్నారు. 2016-17 సంవత్సరంలో బీఏ, బీకాం, బీఎస్సీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. శిక్షణ అనంతరం పరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేసి టీసీఎస్‌ సంస్థలో ఉద్యోగ అవకాశం కల్పిస్తారన్నారు. మిగిలిన వారికి కూడా ప్రముఖ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఆసక్తి గల యువతీ, యువకులు 45వ డివిజన్‌ పరిధిలో గల శారదాదేవి గుడి వెనుక, జీపీటీ రోడ్‌లోని స్త్రీశక్తి భవన్‌లో శనివారం ఉదయం 8 గంటలకు హాజరై బయోడేటా, విద్యార్హతల జిరాక్స్‌ కాపీలతో హాజరు కావాలన్నారు. పూర్తి వివరాల కోసం www.vikasajobs.comవెబ్‌సైట్‌ చూడాలన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: