మెప్మా ఆధ్వర్యంలో 2017 - 2018 ఆర్థిక సంవత్సరంలో నిర్వహించబోవు శిక్షణ, ఉపాధి కార్యక్రమాలకు అర్హత గల యువత దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్‌ ప్రిన్సిపాల్‌ వై రామమోహనరావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 5వ తరగతి నుంచి ఇంటర్‌, డిప్లమో, బీటెక్‌, ఎంటెక్‌ తదితర అరతలు కలిగిన వారు ఆసక్తిగల రంగంలో శిక్షణ పొంది ప్రైవేటు రంగంలో ఉద్యోగం సాధించేందుకు ఈ శిక్షణ ఉపయోగ పడుతుందన్నారు. తాపీ మేస్త్రి, ప్లంబింగ్‌, సర్వేయింగ్‌లో టోటల్‌ స్టేషన్‌, ఆటో క్యాడ్‌, ఎలక్ట్రికల్‌ వైరింగ్‌, సెల్‌ఫోన్‌ రిపేరింగ్‌, కంప్యూటర్‌ డీపీటీ, ఎంఎస్‌ ఆఫీస్‌, ట్యాలీ, టైలరింగ్‌, ఆర్గ్‌ బిల్డింగ్‌ కోర్సులలో శిక్షణ ఇస్తామన్నారు. ఆసక్తి గల వారు ఈనెల 11 నుంచి 15వ తేదీ వరకు ప్రభు త్వ బాలుర పాలిటెక్నిక్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 85559 68561 నెంబర్‌ను సంప్రదించాలని కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: