జిల్లాలోని మైనార్టీవర్గాలకు చెందిన ముస్లింలు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలకు చెందిన నిరుద్యోగ అభ్యర్థులకు ఆరునెలలపాటు రెసిడెన్షియల్‌ ట్రైనింగ్‌ ఇస్తున్నట్లు మైనార్టీస్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఈడీ విఎ్‌సఎస్‌ శాస్ర్తి తెలిపారు. 10వ తరగతి, ఐటిఐ, పాలిటెక్నిక్‌, బీటెక్‌ చదివిన విద్యార్థులకు కేంద్ర ప్లాస్టిక్‌, ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్‌ (సీపెట్‌), సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్‌ (సీఐటీడీ) ఆధ్వర్యంలో ఉపాధి శిక్షణ అందిస్తామన్నారు. మిషర్‌ ఆపరేటర్‌ అసిస్టెంట్‌-ప్లాస్టిక్‌ ప్రోసెసింగ్‌ పోస్టుకు 10వ తరగతి, ఐటీఐ, డిప్లమా చదివినవారు అర్హులన్నారు.



ప్రాజెక్టు డిజైన్‌ యుజింగ్‌ క్యాడ్‌ సాఫ్ట్‌వేర్‌ కోర్సుకు, సిఎన్‌జి అండ్‌ మాన్యుఫాక్చరింగ్‌ టెక్నిక్స్‌లో శిక్షణ కొరకు ప్రొడక్షన్‌, ఆటోమొబైల్‌, ప్రోగ్రామింగ్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ ఇంజనీరింగ్‌లో డిప్లమో చదివినవారు అర్హులన్నారు. శిక్షణ అనంతరం ప్రముఖ కంపెనీల్లో ప్లేస్‌మెంట్స్‌ ఇప్పించడం జరుగుతుందన్నారు. సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్‌ కోర్సులకు టెన్త్‌ నుండి పీజీ వరకు చదివినవారు అర్హులన్నారు. దీనిలో 15 కోర్సుల్లో శిక్షణ ఇస్తామన్నారు. కోర్సునుబట్టి ఒక నెల నుండి 10 నెలల వరకు శిక్షణ ఉంటుందన్నారు. అర్హులైన మైనార్టీ యువతీ, యువకులు తమ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 08812-242463, 9849901162లో సంప్రదించాలని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: