ద్విచక్ర వాహనాన్ని నడపాలన్నా.. ఆ స్కూల్‌లో పాఠాలు చెప్పాలన్నా హెల్మెట్‌ కావాల్సిందేనని ప్రభుత్వ ఉపాధ్యాయులు స్పష్టంచేస్తున్నారు. శిథిలావస్థకు చేరుకున్న పాఠశాల, పెచ్చులూడిన పైకప్పు, ఏ క్షణాన కూలుతుందో తెలియని భవనం.. వీటన్నిటి నేపథ్యంలో ఇక్కడున్న 20 మంది ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్న హెల్మెట్లతో వారు కొంత రక్షణ కల్పించుకుంటున్నారు. అక్కడ చదివే 640 మంది విద్యార్థులకు అదికూడా లేదు. దాంతో భయం భయంగానే చదువుకుంటున్నారు. మెదక్‌ జిల్లా చిన్నశంకరంపేటలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో నెలకొన్న దుస్థితి ఇది ! కొత్త భవనాన్ని నిర్మించాలని పలుమార్లు ప్రజాప్రతినిధులకు విన్నవించినా ఫలితం లేదని టీచర్లు, స్థానికులు వాపోయారు. ఆర్‌ఎంఎ్‌సఏ జేడీ ఉషారాణి గురువారం ఈ పాఠశాలను సందర్శించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: