ఎస్వీ యూనివర్సిటీలోని ఉద్యోగులకు, విద్యార్థులకు ఈ మెయిల్ ఐడీలను కేటాయించనున్నట్లు వీసీ దామోదరం వెల్లడించారు. సోమవారం తన చాంబర్ లో ఆయన కళాశాలల ప్రిన్సిపాళ్లు, హాస్టల్ వార్డెన్లతో సమీక్షించారు. విద్యార్థులకు, ఉద్యోగులకు ఎస్వీయూనివర్సిటీ, ఎడ్యూ. ఇన్ వెబ్ సైట్ నుంచి వ్యక్తిగత ఈ -మెయిల్ ఐడీలను కేటాయించాలన్నారు. ఇందు కోసం వారి వివరాలను సేకరించాలన్నారు. దీని ద్వారా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే సమయంలో ఫలానా వర్సిటీ విద్యార్థి అని సులభంగా తెలుసుకోవచ్చన్నారు.
Image result for sv university email id vc damodaram
వర్సిటీకి ఉన్న పేరు ప్రఖ్యాతులు విద్యార్థి భవిష్యత్తుకు కూడా ఉపయోగపడతాయన్నారు. అద్యాపకులు కూడా వివిధ జర్నల్స్ కి పంపే పరిశోధనా వ్యాసాలను కూడా వర్సిటీ కేటాయించే ఈ - మెయిల్ ఐడీతో పంపాలన్నారు.  దీని వల్ల వర్సి టీ కీర్త మరింత ఇనుమడిస్తుందన్నారు.  ఈ ప్రక్రియ పూర్తియితే ఉద్యోగులు, విద్యార్థులకు వ్యక్తిగత ఈ -మెయిల్ ఐడీ లను కేటాయించిన వర్సిటీగా ఎస్పీయూ గుర్తింపను పొందనుందన్నారు.
Image result for e mail id
 ఈ సదుపాయాన్ని పూర్తి ఉచితంగా కల్పించనున్నామన్నారు.  ఇక వర్సిటీలోని కళాశాలల, హాస్టళ్లలోని సమస్య లను గుర్తించాలన్నారు.  తరగతులు పక్కాగా జరిగేలా చర్యలు చేపట్టాన్నారు. అవసరమైతే ఆకస్మిక తనిఖీలు చేయాలన్నారు. తరగతులు జరగని చోట విద్యార్థులు గ్రంథాలయాల్లో సమయాన్ని కేటాయించేలా చూడాలన్నారు.  
Related image
ఉపాధికి సంబంధించిన మార్గదర్శకత్వాన్ని అందించాలన్నారు.  భోజనంలోని నాణ్యత, హాస్టల్స్, మెస్ లలో పరిశుభ్రతన ఉండాలన్నారు.  ఏ విభాగంలోనూ ర్యాగింగ్ జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.  ఈ కార్యక్రమంలో రెక్టార్ భాస్కర్, రిజిస్ట్రార్ దేవరాజులు, ప్రిన్సిపాళ్లు సవరయ్య, త్యాగరాజు, అబ్బయ్య, మల్లికార్జున, వార్డెన్లు, శ్యాం డేవిడ్ రాజు తదితరులు పాల్గొన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: