ప్రపంచం వైజ్ఞానిక రంగంలో ఎంతో ముందుకు సాగుతుంది. భూమి, ఆకాశం, సముద్రం ఎక్కడైనా సరే మనిషి చేయలేని పని అంటూ..సాధించలేని పని అంటూ ఏదీ లేకుండా పోయింది.  మనిషికి ప్రాణం పోయడం తప్ప ఏదైనా చేసే విధంగా ఎంతో ఎత్తుకు ఎదిగింది ఈ నాటి వైద్య రంగం.  ఇప్పుడు సొసైటీలో అన్ని రంగాల్లో మగవారితో సమానంగా మహిళలు కూడా దూసుకు వెళ్తున్నారు.  ఇదంతా ఒక ఎత్తైతే మనిషి మూఢ విశ్వాసాలు కూడా అదే రేంజ్ లో నమ్ముతున్నారు.  
Image result for కాంపిటీషన్ ఎగ్జామ్స్ 2017
దేవుడిని ఎంత భక్తితో కొలుస్తారో..దెయ్యం అంటే అంతగా భయపడి ఛస్తారు.  ఇదే క్యాష్ చేసుకుంటూ పుట్టగొడుగుళ్లా దొంగ బాబాలు పుట్టుకు వస్తున్నారు.  తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది..సాధారణంగా మనం పరీక్షలు పాస్ కావాలంటే దీక్షతో చదివి దేవుడిని తల్చుకొని నేను పాస్ కావాలి అని కోరుకుంటాం. కానీ ఇక నుంచి మీరు ఇలాంటి టెన్షన్ పడొద్దు.. అసలు పుస్తకాలే తీయొద్దు.. కష్టపడి అసలే చదవొద్దు అంటున్నారు నయా బిజినెస్ కంత్రిగాళ్లు.
Image result for కాంపిటీషన్ ఎగ్జామ్స్ 2017
గుజరాత్ రాష్ట్రంలో పుట్టిన ఈ కొత్త పెన్నుల వ్యాపారం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం అయ్యింది.  విద్యార్థులను, తల్లిదండ్రులను వారి బలహీనతలను క్యాష్ చేసుకుంటూ వీరు చేస్తున్న దందాలు చూస్తే ఔరా అనిపిస్తుంది. గుజరాత్ రాష్ట్రంలోని పంచమహల్ జిల్లాలో కాష్టభంజన్ అనే టెంపుల్ ఉంది. ఇక్కడ వీరాంజనేయస్వామి కొలువై ఉన్నాడు. ఈ ఆలయంలో పూజలు చేసిన పెన్నులను ప్రత్యేక ధరతో అమ్ముతున్నారు. మార్కెట్ లో 20 రూపాయలు ఉండే ఈ పెన్నును.. 1900 రూపాయలకు అమ్ముతున్నారు.  
Image result for కాంపిటీషన్ ఎగ్జామ్స్ 2017
మరో ట్విస్ట్ ఏంటంటే..ఈ పెన్నుకు బిల్ కూడా ఇస్తారట..ఆ బిల్ ఇచ్చే ముందు క్యాండెట్ మొబైల్ నంబర్, హాల్ టికెట్ కాపీ, కాలేజీ ఐడీ కార్డ్ జిరాక్స్ లు ఇవ్వాలంట. ఇలా ఇస్తేనే కాష్టభంజన్ స్వామి కరుణాకటాక్షాలతో పరీక్ష ఈజీగా పాసైపోతారంట. గుజరాత్ లో మొదలైన పెన్నుల వ్యాపారం ఇప్పుడు మిగతా రాష్ట్రాలకు పాకుతోంది.  ఇంకేముందు పరీక్షలన్నా..చదువు అన్నా బద్దకించే విద్యార్థులకు ఇదో వరంగా మారిపోయింది..తల్లిదండ్రులను బలవంత పెట్టి మరీ ఈ పెన్నులో కొనివ్వాలని డిమాండ్ చేస్తున్నారట. మరోవైపు కాష్టభంజన్ దేవాలయం వాళ్లు మాత్రం తమకేదీ తెలియదని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: