ఎన్నో సంవత్సరాల నుండి భారతీయ విద్యార్థులు ఇంజనీరింగ్ లేదా వైద్య విద్య భారతదేశం లో అభ్యసించిన తర్వాత మరింత పై చదువుల కోసం విదేశాలకు వెళ్లేవారు. కానీ ఈ మధ్య కాలంలో ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే విదేశీ బాట పడుతున్న విద్యార్థుల సంఖ్య సంవత్సరసంవత్సరం పెరుగుతూనే ఉంది. ఎందుకు విద్యార్ధ్యులు విదేశాల్లో చదవడానికి ఆసక్తి చూపిస్తున్నారు? తల్లిదండ్రులు ఎందుకు విదేశాల్లో చదివించడానికి స్తోమతకు మించి ఖర్చు పెట్టడానికి సిద్ధపడుతున్నారు ? అనే విషయాలకు సంబంధించి కొన్ని ఆసక్తికర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. 

Image result for indian students

ఎందుకు భారతీయ విద్య నచ్చడం లేదు :
మీడియాలో తరచూ బాహాటంగానే రతన్ టాటా మరియు ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి వంటి ప్రముఖులు మన దేశంలో ప్రస్తుతం ఉన్న విద్య వ్యవస్థ, ముఖ్యంగా ఉన్నత విద్యను ఉద్దేశించి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రస్తుతం మన దేశంలో చాలా విశ్వవిద్యాలయాల్లో అనుసరిస్తున్న బోధనా పద్ధతులు ఇప్పుడు ఉన్న పోటీ ప్రపంచానికి సరిపోవని. వాటిని సమూలంగా మార్పు చేస్తే గాని విద్యార్థుల నైపుణ్యం మెరుగుపడదని తేల్చి చెప్పారు.

Image result for indian students

చదువుతున్న చదువులు ఉద్యోగానికి ఉపయోగపడటం లేదు. నిరుద్యోగం రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతుంది. కాలేజీ లో నైపుణ్యంలేని అధ్యాపకులు విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. దీంతో చదువు పూర్తి చేసుకొని బయటకు వచ్చిన చాలామంది ఆకారం ఉన్న పట్టభద్రుల్లా మిగిలిపోతున్నారే గాని జ్ఞానం ఉన్న విద్యావంతుల్లా తయారవడం లేదు. ఈ మాత్రం దానికే లక్షలు లక్షలు ఖర్చు అయిపోతోంది. దీనికి తోడు భారత దేశంలో అన్ని రంగాల్లో తీవ్రమైన పోటీతత్వం,దీంతో భవిష్యత్తు ఏమైపోతుందో అనే అయోమయంలో విద్యార్థులు,వాళ్ళ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

Image result for indian students

విదేశీ విద్య పై అంత మోజు ఎందుకు ?
అమెరికా, కెనడా ఇంకా తదితర దేశాల్లో చదవడానికి మన విద్యార్థులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అందుకు ప్రధాన కారణాలను విశ్లేషిస్తే...

1) ఇక్కడికంటే కూడా అక్కడ విద్యావ్యవస్థ, బోధనా పద్ధతులు ఎంతో ఉన్నతంగా, అత్యుత్తముగా ఉంటున్నాయి.
Image result for విదేశీ విద్య
2) చదువు పూర్తిచేసిన తర్వాత ఖచ్చితంగా ఎదో ఒక ఉద్యోగం లభిస్తుంది అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది.

3) విదేశాలకు వెళ్లడం వల్ల పిల్లల్లో బాధ్యతతో పాటు ప్రపంచ జ్ఞానం పెరుగుతుందని తల్లిదండ్రులు భావిస్తున్నారు. 

4) ఇక్కడి కంటే అక్కడ చదువుకోవడానికి ఖర్చు కొద్దిగా ఎక్కువ అయినా ఎదో ఒక పార్ట్ టైం ఉద్యోగం చేయడం ద్వారా చదువుకుంటున్న సమయం లోనే  డబ్బులు సంపాదించడం మొదలుపెడుతున్నారు.
Image result for విదేశీ విద్య
5)ఆర్ధిక స్తోమత అంతగా లేక పోయినా బ్యాంకులు విద్య రుణాలు ఇస్తున్నాయి. ఇలా ఎన్నో సహేతుక కారణాల వల్ల విదేశీ విద్య ను అభ్యసించే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది.

భారత దేశానికి జరుగుతున్న నష్టం:
భారత దేశం నుండి ఎంతో మంది తెలివైన యువత విదేశాలకు వెళ్లిపోతున్నారు. దీని వల్ల భారత దేశం ఎంతో మేధోసంపత్తిని కోల్పోతోంది .ఇలానే గనుక కొనసాగితే దీర్ఘ కాలంలో భారత దేశం విపరీతంగా నష్టపోయే  ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని విద్య వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి ప్రస్తుతమున్న పోటీ ప్రపంచానికి అనుగుణంగా మార్పులు చేస్తే  కానీ పరిస్థితి మారదని చాలా మంది నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.మరి మన ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి విద్యార్థుల జీవితాలను కాపాడి, నిరుద్యోగాన్ని పారద్రోలి, భారతదేశ భవిష్యత్తుని  కాపాడతాయో లేదు వేచి చూడాలి .


మరింత సమాచారం తెలుసుకోండి: