ఆంధ్రప్రదేశ్ డీఈఈసెట్ ఫలితాలను మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. మొత్తం 53,962 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 39,632 మంది అర్హత సాధించినట్టు ఆయన వివరించారు. ప్రాథమిక పాఠశాలల్లో విద్యాబోధనకు ఉద్దేశించిన డైట్ కేంద్రాల్లో ప్రవేశానికి డీఈఈసెట్ నిర్వహించారు.

 

      2 విడతల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని మంత్రి గంటా వెల్లడించారు. ఈ నెల 19 నుంచి 21 వరకూ ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఉంటుందన్నారు. వీరికి 25వ తేదీ సీట్లు కేటాయిస్తామని, 26 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందన్నారు. వచ్చే నెల 9 నుంచి 12 వరకూ సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చునని వారికి 13న సీట్లు కేటాయింపు, 16 నుంచి 18 వరకూ సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని మంత్రి తెలిపారు.

 

ఇక టాపర్స్ ను పరిశీలిస్తే మ్యాథమ్యాటిక్స్ లో కృష్ణాజిల్లాకు చెందిన కె.దుర్గాపవన్ కుమార్ (90 మార్కులు), ఫిజిక్స్ లో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎ.సి.సరోజ (78 మార్కులు), బయాలజీలో కృష్ణా జిల్లాకు చెందిన జి.తేజస్వి (84 మార్కులు), సోషల్ స్టడీస్ లో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన టి.వనజ (72 మార్కులు) సాధించి ఫస్ట్ ప్లేస్ సాధించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: