తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.  ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎన్నో అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు.  పారిశ్రామికరంగం, విద్యా, వైద్య, పట్టణాభివృద్ది పనులు విషయంలో ఎప్పటికప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు.  హైదరాబాద్ ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు.  

Image result for kcr

అంతే కాదు పరిశ్రమలు, విద్యా సంస్థలకు మధ్య ఉన్న గ్యాప్ తగ్గించాలంటే ఈ రెండింటి మధ్య ఒప్పందాలుండాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోంది.   ఈ నేపథ్యంలో దేశ, విదేశాల్లోని ప్రఖ్యాత కంపెనీలు, సంస్థలతో తెలంగాణ విశ్వవిద్యాలయాలు ఒప్పందాలు చేసుకుంటున్నాయి. తాజాగా ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో జేఎన్టీయు, సిఐఐల మధ్య ఒప్పందం జరిగింది.  


ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్థులకు పరిశోధనలో శిక్షణ, ఉపాధి అవకాశాలు బాగా ఉంటాయని ఆయన తెలిపారు. పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య నిరంతరం మంచి సంబంధాలుండాలన్నారు. ఈ కార్యక్రమంలో జేఏన్టీయు రిజిస్ట్రార్ డాక్టర్ ఎన్.యాదయ్య, జేఎన్టీయు జె-హబ్ కన్వీనర్ ప్రొఫెసర్ విజయకుమారి, సిఐఐ తెలంగాణ డైరెక్టర్ ఎస్వీ రాజీవ నాగ్ తదితరులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: