పేద బ్రాహ్మణుల సంక్షేమానికి బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ ద్వారా కృషి చేస్తున్నామని పరిషత్‌ అధ్యక్షుడు కేవీ.రమణాచారి తెలిపారు.దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందిస్తున్నామని తెలిపారు. వేద విద్యను అభ్యసించే వారికి స్థాయిని బట్టి ప్రతి నెలా రూ.500తోపాటు పూర్తి చేసి బయటకు వచ్చేటప్పుడు రూ.5 లక్షలు అందించే విధంగా చర్యలు తీసుకున్నామని రమణాచారి తెలిపారు. 14 వేద పాఠశాలలకు రూ.25 లక్షలు ఆర్థికసాయం మంజూరు చేశామని చెప్పారు.

సరస్వతీ విద్యా ప్రశస్తి పథకం కింద పది, ఇంటర్మీడియట్‌, డిగ్రీ, పీజీ, ప్రొఫెషనల్‌ కోర్సుల్లో ప్రతిభ కనబరిచే విద్యార్థులకు వరుసగా రూ.7500, రూ.10 వేలు, రూ.15 వేలు, రూ.20 వేలు, రూ.35వేల చొప్పున ప్రోత్సాహకం అందించనున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు మొత్తం 252 మంది విద్యార్థులు లబ్ధి పొందారని వెల్లడించారు.

ఇప్పటికీ 56 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రూ.3.29 కోట్ల ఆర్థికసాయం అందించేందుకు కమిటీ నిర్ణయించిందని తెలిపారు.  మూడేళ్ల తర్వాత ఆ మొత్తాన్ని దంపతులు తీసుకునే వీలు కల్పిస్తున్నామన్నారు. దీర్ఘకాలిక, అత్యవసర చికిత్సలకు రూ.5 లక్షల వరకు అందించాలని పరిషత్‌ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: