తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ది సంక్షేమ పథకాలు తీసుకు వస్తుంది.  అయితే పేద ప్రజల కోసం ఇప్పటికే ఎన్నో పథకాలు తీసుకు వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజన సంక్షేమాభివృద్ది కోసం పాటు పడుతున్నారు.  ముఖ్యంగా గిరిజనులు విద్యలో రాణించాలని జిల్లాల వారీగా ఎన్నో అభివృద్ది పనులు చేపడుతున్నారు. 

తాజాగా మేడ్చల్‌ జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన గిరిజన శాఖ వసతి గృహాల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని జిల్లా ఎస్టీ వెల్ఫేర్‌ శాఖ అధికారి ఛత్రునాయక్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 

కీసర మండలం నాగారం గ్రామంలో, మేడ్చల్‌లో(బాలురు), మేడిపల్లి(బాలికలు)లో నూతనంగా ప్రభుత్వ కళాశాలల వసతి గృహాలను ప్రారంభించినట్లు తెలిపారు. ఆసక్తి గలవారు జిల్లా ఎస్టీ వెల్ఫేర్‌ శాఖ కార్యాలయం వద్ద పొంది తగు ధ్రువీకరణ పత్రాలతో ఈనెల 31 లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: