తెలంగాణ ఏర్పడిన తరువాత నిరుద్యోగులని నిరాశపరచకుండా..ఎప్పుడు ఎదో ఒక నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది తెలంగాణా ప్రభుత్వం..మొన్నటికి మొన్న ఫారెస్ట్ డిపార్టుమెంట్లో ఉద్యోగాలు తీసింది..ఉపాధ్యాయ ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చింది..ఇప్పుడు తాజాగా నర్సింగ్ చదివిన విద్యార్ధులకోసం జాబ్ మేలా:

 

ఈ నెల 29న వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఉపా ధి కార్యాలయంలో జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు..అర్బన్‌ జిల్లా ఉపాధి అధికారి మల్లయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘మాక్స్‌కేర్‌’ఆస్పత్రిలో 30 జీఎన్‌ఎం స్టాఫ్‌నర్సు, 20 బీఎస్సీ నర్సింగ్‌ స్టాఫ్‌నర్సుల ఉద్యోగాల కోసం జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్‌ చదివి 18 సంవత్సరాలు నిండిన వారు అర్హులని...ఎంపికైన వారికి రూ.7 వేల నుంచి రూ.15 వేల వరకు వేతనం చెల్లిస్తారని ఆయన వివరించారు.

 

అనుభవం ఉన్న వారికి ప్రాధానత్య ఇస్తారని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు(మహిళలు,పురుషులు) తమ పూర్తి బయోడేటా, విద్యార్హతల జిరాక్స్‌ ప్రతులు, ఆధార్‌ కార్డుతో 29న ఉదయం 10 గంటలకు వరంగల్‌ ములుగు రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రాంగణంలోని అర్బన్‌ జిల్లా ఉపాధి కార్యాలయానికి రావాలని కోరారు. విద్యార్ధులు మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి 9963758829 నెంబర్‌ను సంప్రదించాలని సూచించారు..

మరింత సమాచారం తెలుసుకోండి: