గూగుల్ ఈ సంస్థలో పనిచేయాలని ఎంతో మంది ఐటీరంగ నిపుణులు ఎదురుచూస్తూ ఉంటారు.ఇప్పుడు గూగుల్ యువ విద్యార్ధుల కోసం లేటెస్ట్ మొబైల్ టెక్నాలజీని పరిచయం చేస్తూ వారిని ఈ రంగం లో నడిపించడానికి గూగుల్ డే లాంగ్ మొబైల్ డెవలపర్ ఫెస్ట్‌ను బెంగుళూరులో నిర్వహించింది. దేశవ్యప్తంగా సుమారు 20లక్షల మొబైల్ డెవలపర్స్‌కు శిక్షణనిచ్చే ఉద్దేశ్యంతో ప్రారంభించబడిన ఈ కార్యక్రమాన్ని సీఎమ్ఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్‌లో గూగల్ నిర్వహించింది.

 

ఇదేవిధమైన శిక్షణా కార్యక్రమాలను సుమారుగా  12 రాష్ట్రాల్లోని లీడింగ్ ఇంజినీరింగ్ కళాశాలల్లో గూగుల్  నిర్వహించబో తోంది. ప్రపంచంలోనే టెక్నాలజీ  పరంగా అనేకదేశాలలో భారతీయులు చాటే సత్తా అందరికీ తెలిసినదే ఇండియా లో విద్యార్ధులు కొత్తగా వచ్చే టెక్నాలజీలని నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయం గూగుల్ యూనివర్శిటీ రిలేషన్స్ - ప్రొడక్ట్స్ గ్రూప్ డెవలపర్ విలియం ఫ్లోరెన్స్ తెలిపారు.

 

ఈ స్మ్మేట్ లో పాల్గొనే విద్యార్ధులకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విద్యార్థులకు మెచీన్ లెర్నింగ్, ఫైర్ బేస్, ఆండ్రాయిడ్ అండ్ ప్రోగ్రెస్సివ్ వెబ్ యాప్స్ పై గూగుల్ అవగాహన కల్పిస్తోంది. ఈ ఫెస్ట్‌లో పాల్గొనే విద్యార్థులకు హ్యాండ్స్-ఆన్ ల్యాబ్స్ సెషన్స్‌లో పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని కూడా గూగుల్ కల్పిస్తోంది. అంతకు ముందు బెంగళూరులో నిర్వహించిన యాప్ ఎక్స్‌లెన్స్ సమ్మిట్‌లో భాగంగా సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ 'Made for India' పేరుతో సరికొత్త ప్రోగ్రామ్‌ను లాంచ్ చేసింది.

 

భారతీయుల అవసరాల కోసం యాప్స్‌ను తయారు చేయటమే లక్ష్యంగా లాంచ్ కాబడిన ఈ ప్రోగ్రామ్ ద్వారా యాప్ డెవలప్పర్స్ కి ఇది మంచి అవకాశంగా కలిపిస్తోంది.ఇండియన్ డెవలపర్స్ కోసం రూపొందించబడిన ఈ ఇనీషియేటివ్‌లో భాగంగా ప్రత్యేకంగా కేటాయించబడిన సెక్షన్‌లో ఇండియన్ యాప్స్‌ను ప్రదర్శిస్తారు. ఈ ప్రోగ్రాంలో భారతీయులు డెవలప్ చేసి డిజైన్ చేసిన  యాప్స్ కి ఇక్కడ చోటు ఉంటుంది. తమ యాప్‌ను మేడ్ ఫర్ ఇండియా సెక్షన్‌లో చూడాలంటే ఈ g.co/play/madeforindia లోకి వెళ్లి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: