సర్వోన్నత నాయస్థానం ఇచ్చిన తీర్పుతో కరస్పాండెన్స్ లో ఇంజనీరింగ్ చదివి డిగ్రీ తీసుకున్న విద్యార్ధులు డైలమాలో పడ్డారు.సుమారు దేశంలో ఉన్న నాలుగు డీమ్డ్ యూనివర్సిటీ లకి ఈతీర్పు తో గట్టి షాక్ తగిలింది..వారు నిర్వహిస్తున కరస్పాండెన్స్ కోర్సుద్వారా ఇనినీరింగ్ చదివిన విద్యార్ధుల డిగ్రీ లని రద్దు చేసింది.

Image result for degree college

 జేఆర్‌ఎన్‌ రాజస్థాన్‌ విద్యాపీఠ్‌, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌ (రాజస్థాన్‌),అలహాబాద్‌ అగ్రికల్చరల్‌ ఇన్‌స్టిట్యూట్‌, వినాయక మిషన్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ (తమిళనాడు) 2001 నుంచి కరెస్పాండెన్స్‌ కోర్సు ద్వారా ప్రదానం చేసిన ఇంజనీరింగ్‌ డిగ్రీలను రద్దు చేస్తూ జస్టిస్‌ ఏకే గోయల్‌, జస్టిస్‌ యూయూ లలిత్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. దూరవిద్య ద్వారా కోర్సు పూర్తిచేసిన 2001-05 బ్యాచ్‌ విద్యార్థులు.. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) నిర్వహించే పరీక్షకు హాజరై డిగ్రీలు పొందవచ్చని స్పష్టం చేసింది.

 Related image

మిగతా బ్యాచ్‌ల విద్యార్థుల డిగ్రీలను మాత్రం రద్దుచేసింది. ఆ సమయంలో ఈ  డీమ్డ్‌ వర్సిటీలు ఆ కోర్సు కోసం ఎలాంటి అనుమతులూ తీసుకోకపోవడమే రద్దుకు కారణంగా తెలిపింది. ఆ డిగ్రీల ఆధారంగా ఆ విద్యార్థులు పొందిన అన్ని ప్రయోజనాలను ఉపసంహరిస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. అయితే ఎంతమంది విద్యార్ధులు ఇప్పటివరకు ఫీజులు ఈ కోర్స్ కి గాను చెల్లించారో వారికి ప్రతీ పైసా ఆ యూనివర్సిటీలు చెల్లించాలని పేర్కొంది..ఏఐసీటీఈ అనుమతి లేకుండా 2018-19 విద్యాసంవత్సరం నుంచి ఎలాంటి కరెస్పాండెన్స్‌ కోర్సులు నిర్వహించరాదని దేశవ్యాప్తంగా అన్ని డీమ్డ్‌ వర్సిటీలను ధర్మాసనం ఆదేశించింది.

 Related image

అంతేకాదు డీమ్డ్ యూనివర్సిటీ ల యొక్క పనితీరుని పరిశీలించేందుకు ఒక ఉన్నతస్థాయి కమిటీలని ఏర్పాటు ,మరియు  నెలలోగా ముగ్గురు సభ్యుల కమిటీని వేయాలి. వారు విద్య, దర్యాప్తు, న్యాయం/పరిపాలన రంగాల్లో అత్యున్నత పదవులు చేపట్టిన ప్రముఖులై ఉండాలి. ఈ కమిటీ ఆరు నెలల్లో నివేదిక ఇవ్వాలి. కోర్టు ఎటువంటి ఆదేశాలని ఇచ్చిందో దానికి తగ్గట్టుగా యూనివర్సిటీలు నడిచుకునేలా చేయాలని సూచించింది.

Image result for degree college

అంతేకాదు..ఈ డీమ్డ్‌ వర్సిటీలు దూరవిద్య కోర్సులను నిర్వహించేందుకు సహకరించిన ప్రభుత్వాధికారులను పట్టుకుని శిక్షించాలని సిబిఐ కి ఆదేశాలు జారీచేసింది. కోర్టు ఆదేశాలతో ఇప్పుడు ముందుగానే పట్టాలు పొందిన విద్యార్ధుల భవితవ్యం ఏమిటి అనేది ప్రశ్నార్ధకం అయ్యింది.


మరింత సమాచారం తెలుసుకోండి: