గూగుల్ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థ..ఈ సంస్థలో ఉద్యోగాలకోసం ఇంజనీరింగ్,ఐటీ చేసిన వాళ్ళు ఎంతో మంది విద్యార్ధులు కలలు కంటూ ఉంటారు..ఒక్క సారి గూగుల్ లో ఉద్యోగం వస్తే చాలు లైఫ్ టర్న్ అవుతుంది అనేది నిజం..జీతాలు వేల నుంచీ లక్షల్లో మొదలవుతాయి..గూగుల్ లో జాబ్ చేస్తున్నారు అంటే ఆ క్రేజ్ వేరేలా ఉంటుంది కూడా..అయితే ఇప్పుడు గూగుల్ భారతీయ విద్యార్ధుల కోసం ముందుకొచ్చింది..

 Image result for google offer indian students

భారతీయ విద్యార్ధుల తెలివితేటలు ప్రపంచం అంతా తెలుసు గూగుల్ కి అయితే ఇంకా బాగా తెలుసు అనుకుంటా అందుకే నెమో భారతీయులకి శిక్షణలు ఇచ్చి మరీ ఉద్యోగాలు కలిపిస్తోంది.కొన్ని నెలల క్రితం భరత్ లో అనేక యూనివర్సిటీలలో కొత్తగా ఏర్పడుతున్న యాప్స్ లలో కొత్త కొత్త టెక్నాలజీ ని అందిపుచ్చుకోవడానికి భారతీయులకి అనేక ప్రాంతాలలో ఉచిత శిక్షణా తరగతులు నిర్వహించింది..ఇప్పుడు మరొక అవకాశాన్ని కల్పిస్తూ ముందుకు వచ్చింది..

 

 భారతీయ యువకులకు శిక్షణ ఇచ్చేందుకు మరో మారు గూగుల్ సంస్థ ముందుకొచ్చింది. ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌లో 1.3 లక్షల భారత యువకులకు శిక్షణ ఇచ్చేందుకు గూగుల్ సంస్థ ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది. గూగుల్ సంస్థ ఎడ్యుకేషన్‌ ఇనిస్టిట్యూషన్‌ ఉడాసిటీ, టెక్నాలజీ లెర్నింగ్‌ ఫ్లాట్‌ఫాం ప్లూరల్‌సైట్ కంపెనీలతో కలిసి పని చేయనుంది. ఇండియాలో మొత్తం 1.3 లక్షల మంది విద్యార్థులను డెవలపర్స్‌గా తయారు చేయనుంది.

 

అంతేకాదు తమ ద్వారా శిక్షణ పొందనున్న విద్యార్థులు కొత్త స్కాల్కర్‌షిప్‌ ప్రొగ్రామ్‌ ద్వారా లబ్ధిపొందనున్నారు. ప్లూరల్‌సైట్‌ టెక్నాలజీ లెర్నింగ్‌ ప్లాట్‌ఫామ్‌ కంపెనీ నుంచి లక్ష మందికి, ఉడాసిటీ ప్లాట్‌పామ్ సంస్థ నుంచి 30 వేల మందికి గూగుల్‌ స్కాలర్‌షిప్‌లను అందించనుంది. ఈ అవకాశాన్ని కలిపించడానికి కారణం భారతీయ యువతీ యువకులు ఎంతో తెలివైన వారు.భారతీయులకి ఎంతో అపారమైన జ్ఞానం ఉంది అంటూ చెప్పుకోస్తోంది గూగుల్.


మరింత సమాచారం తెలుసుకోండి: