తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డాకా వివిధ రకాలుగా ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తూనే వస్తున్నా నిరుగ్యోగ సమస్య అధికంగా ఉండటం..కొన్ని కొన్ని టెక్నికల్ విషయాల వల్ల నోటిఫికేషన్ లేటుగా ఉంటోంది అని..ప్రభుత్వం చెప్తోంది..తాజాగా ఇప్పుడు టీఎస్‌పీఎస్సీ  (తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌) వివిధ పోస్టులకి నోటిఫికేషన్ విడుదల చేసింది.. అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ - సివిల్‌ (ఎఇఇ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా తెలంగాణ రూరల్‌ వాటర్‌ సప్లయ్‌ అండ్‌ శానిటేషన్‌ విభాగంలో 277 ఎఇఇ పోస్టులను భర్తీ చేయనుంది.

 Image result for తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌

నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం ఖాళీలు  –  277

జోన్‌-5 ఖాళీలు:   123

జోన్‌-6 ఖాళీలు:  154

 

విద్యార్హత

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్‌ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ. లేదా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌ నిర్వహించే ఎఎంఐఈ పరీక్షలో సివిల్‌ బ్రాంచ్‌తో సెక్షన్‌ ఎ, బి ఉత్తీర్ణత.

వయసు

18-44 ఏళ్లు (జూలై 1, 2017 నాటికి). నిబంధనలకు అనుగుణంగా ఆయా వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

 

దరఖాస్తు:   ఆన్‌లైన్‌ ద్వారా

దరఖాస్తుకు చివరితేది:   డిసెంబరు 16, 2017

మరిన్ని పూర్తీ వివరాలకోసం

వెబ్‌సైట్‌:  tspsc.gov.in

 

ఎంపిక విధానం

 ఎంపిక విధానంలో రెండు ప్రక్రియలు ఉంటాయి..ఒకటి రాత పరీక్ష,  రెండు ఇంటర్వ్యూ (పర్సనాలిటీ అసెస్‌మెంట్‌ టెస్ట్‌). ఈ మొత్తం ప్రక్రియకు 500 మార్కులు. ఈ రెండు పరీక్షలలో సాధించిన ఉత్తీర్ణత ఆధారంగానే తుది నియామకం జరుగుతుంది.

 

రాత పరీక్ష విధానం

 రాత పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. వీటిని ఆన్‌లైన్‌ లేదా ఔంఆర్‌ విధానంలో నిర్వహిస్తారు.

పేపర్‌-1: జనరల్‌ స్టడీస్‌ అండ్‌ జనరల్‌ ఎబిలిటీస్‌. ఈ పేపర్‌ ఇంగ్లీష్‌, తెలుగు భాషల్లో ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. ఇందులో 150 ప్రశ్నలు 150 మార్కులకు ఉంటాయి. సమాధానాలను గుర్తించడానికి 150 నిమిషాలు కేటాయిస్తారు.

పేపర్‌-2:   సివిల్‌ ఇంజనీరింగ్‌ (సబ్జెక్ట్‌ టెస్ట్‌). ఈ పేపర్‌ ఇంగ్లీష్‌ భాషలో ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. ఇందులో 150 ప్రశ్నలు 300 మార్కులకు ఉంటాయి. సమాధానాలను గుర్తించడానికి 150 నిమిషాలు ఇస్తారు.

 

జనరల్‌ స్టడీస్‌ అండ్‌ జనరల్‌ ఎబిలిటీస్‌

ఇందులో తెలంగాణ ఉద్యమం, కరెంట్‌ అఫైర్స్‌, లాజి కల్‌ రీజనింగ్‌, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌, అనలిటికల్‌ ఎబిలిటీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఇండియన్‌ ఎకానమీ, రాజ్యాంగం, తెలంగాణలోని రాజకీయ పరిస్థితులు, పర్యావరణం, ఎకాలజీ, తెలంగాణ, భారతదేశంలోని సహజ వనరులు, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలు, ఉత్సవాలు, ఎకానమీ, ప్రభుత్వ పథకాలు తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.

 

ఆంగ్ల భాష సామర్థ్యాన్ని కోసం కూడా ఒక టెస్ట్ ఉంటుంది ఇందులో పదవ తరగతి స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి... ఇందులో మెరుగైన మార్కులు సాధించాలంటే తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక, జీవన విధానం వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించాలి. ఉద్యమ నేపథ్యంపై కూడా ప్రశ్నలు రావొచ్చు. కాబట్టి తెలంగాణ ఉద్యమానికి సంబంధిం చిన సమాచారాన్ని క్షుణ్నంగా అవగాహన చేసుకోవాలి. టిఎస్‌పిఎస్సీ గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే ప్రశ్నల సరళి, క్లిష్టతపై ఒక అవగాహన వస్తుంది.

 

సివిల్‌ ఇంజనీరింగ్‌

సివిల్‌ ఇంజనీరింగ్‌ సబ్జెక్ట్‌లో అభ్యర్థుల ప్రతిభని గుర్తించడానికి ఏర్పాటు చేసిన విభాగం ఇది..ఇందులో ప్రశ్నల క్లిష్టత డిగ్రీ స్థాయిలో ఉంటుంది. ఈ పేపర్‌లో బిల్డింగ్‌ మెటీరియల్స్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌, స్ర్టెంథ్‌ ఆఫ్‌ మెటీరియల్స్‌ అండ్‌ థియరీ ఆఫ్‌ స్ట్రక్చర్స్‌..ఆర్‌సిసి అండ్‌ స్టీల్‌ స్ట్రక్చర్స్‌, ఫ్లూయిడ్‌ మెకానిక్స్‌ అండ్‌ హైడ్రాలిక్స్‌, హైడ్రాలజీ అండ్‌ వాటర్‌ రీసోర్స్‌ ఇంజనీరింగ్‌..ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్‌.. ట్రాన్స్‌పోర్టేషన్‌ ఇంజనీరింగ్‌, సాయిల్‌ మెకానిక్స్‌ అండ్‌ ఫౌండేషన్‌ ఇంజనీరింగ్‌.. ఎస్టిమేషన్‌.. కాస్టింగ్‌..కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌, సర్వేయింగ్‌ వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇందులో మెరుగైన మార్కులు సాధించాలంటే ప్రతి టాపిక్‌కు సంబంధించి ముఖ్యమైన ఫార్ములాలను రూపొందించుకోవాలి. బేసిక్స్‌ నుంచి అడ్వాన్స్‌డ్‌ అంశాలపై అవగాహన పెంచుకునేలా ప్రిపరేషన్‌ సాగించాలి.

 

ఇంటర్వ్యూ:

ఇంటర్వ్యూ లో 50 మార్కులు ఉంటాయి..రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి మాత్రమే ఇంటర్వ్యూకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. ఇందులో అభ్యర్థి గుణగణాలను పరీక్షించడానికి ప్రాధాన్యం ఇస్తారు. అభ్యర్ధి ఎంతవరకూ భాద్యతతో మెలుగుతున్నాడు..వృత్తి పరంగా ఎంత భాద్యతగా మెలుగుతాడు అనేది ముఖ్యంగా గమనిస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: