ఏపీ రాష్ట్ర ప్రభుత్వం..ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయాక ఒక్కో సమస్యకి ఒక్కో పరిష్కారం వెతుక్కుంటూ..అంచెలంచెలుగా వాటిని పరిష్కరిస్తూ వస్తున్న ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రంలోని గిరిజిన..ప్రాంతాలపై ప్రత్యేకమైన దృష్టి పెట్టింది..అంతేకాదు గిరిజన ప్రాంతాలలో  విద్యా వైద్య వంటి ముఖ్యమైన...రంగాల్లో మెరుగైన ఫలితాలు సాదించేందుకు సాంకేతిక సహకారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం యునిసెఫ్ ని కోరింది.

 

 యూనిసెఫ్‌ సహకారంతో రానున్న ఐదేళ్లలో అమలు చేయనున్న వివిధ పథకాలకు సంబంధించి, యూనిసెఫ్‌ వార్షిక సంయుక్త రిప్లక్సన్‌ సమావేశం మంగళవారం సచివాలయంలో సీఎస్‌ దినేశ్‌కుమార్‌ అధ్యక్షతన జరిగింది...ఈ సందర్భంగా రానున్న ఐదేళ్లలో రాష్ట్రంలో పాఠశాల విద్య..ఆరోగ్యం..జువనైల్‌ జస్టిస్‌..కార్మిక...ప్రణాళిక..హోమ్‌.. గ్రామీణాభివృద్ధి.. పంచాయతీరాజ్‌..ఆర్‌డబ్ల్యూఎస్‌..పారిశుధ్యం..మహిళాశిశు సంక్షేమంపై తీసుకోవాల్సిన చర్యలపై ఇందులో చర్చించారు.

 

అయితే ముఖ్యంగా ఈ సదస్సులో మాట్లాడుతూ గిరిజనల పిల్లల విద్యకి అత్యధిక ప్రాముఖ్యతని ఇస్తున్నట్టుగా తెలిపారు..ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కొన్నేళ్ల నుంచి అనేక పథకాలు అమలు చేస్తున్నా, లక్ష్యాలు పూర్తిగా సాధించలేకపోతున్నామన్నారు. ఈ లక్ష్య సాధనకు యూనిసెఫ్‌ సాంకేతిక సహకారం తీసుకోవాలని సూచించారు.ఇప్పుడు యునిసెఫ్ సహకారంతో అక్కడి గ్రామాలలో గిరిజనుల విద్యకి మంచి అవకాశం దొరకనుంది అని చెప్తున్నారు అధికారులు.


మరింత సమాచారం తెలుసుకోండి: