తెలంగాణాలో ఉపాధ్యాయుల పోస్తులని భర్తీ చేయడానికి ఇంతకూ ముందే నోటిఫికేషన్ విడుదల చేశారు.అయితే ఇప్పుడు..ఉపాధ్యాయ పోస్టుల దరఖాస్తు గడువును డిసెంబర్ 15 వరకు పొడిగించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చర్యలు చేపట్టింది. ఇంతకూ ముందు ఇచ్చిన లాస్ట్ డేట్ 30 తో ముగియనుంది.

 Image result for తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్

ఇదిలా ఉంటే హై కోర్టు ఇచ్చిన తాజా ఆదేశాల ప్రకారం..ఈ పోస్టుల భర్తీని జిల్లాల వారీగా కాకుండా పాత 10 జిల్లాల వారీగా పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. అలాగే విద్యా శాఖ కూడా 31 జిల్లాలకు ఇచ్చిన 8,792 పోస్టులను పాత జిల్లాల వారీగా చేసి ఇవ్వాల్సి ఉంటుంది. వాటితోపాటు పాత జిల్లాల వారీగా పోస్టుల రోస్టర్ కమ్ రిజర్వేషన్లను టీఎస్‌పీఎస్సీకి అందజేయాల్సి ఉంది.ఈ ప్రాసెస్ అంతా జరగడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి దరఖాస్తుల గడువును డిసెంబర్ 15వ తేదీ వరకు పొడిగించాలని టీఎస్‌పీఎస్సీ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది..ఒక వేళ జివో జారీ విషయంలో కానీ రోస్టర్ ఇవ్వడంలో ఆలస్యం అయితే మరిన్ని రోజులు గడువు పెంచుతాము అని తెలిపారు.

 

పాత ఆప్షన్లు మార్చుకునే వీలు

 

ఇదిలా ఉంటే ఈ పోస్టుల భర్తీ కోసం అక్టోబర్ 30వ తేదీ నుంచి స్వీకరించిన దరఖాస్తుల్లో అభ్యర్థుల స్థానికతను 31 జిల్లాల వారీగా తీసుకున్నారు అప్పటి ఆదేశాలు ప్రకారం..దీంతో వారు తమ గ్రామం కొత్త జిల్లాల్లో దేని కింద వస్తుందో వాటినే ఎంచుకున్నారు. ఇపుడు పాత జిల్లాల ప్రకారం పోస్టులను భర్తీ చేయాల్సి ఉన్నందున కొత్త జిల్లాల ప్రకారం స్థానికత చెల్లదు. అందుకే ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి ఎడిట్ ఆప్షన్ ఇచ్చి పాత జిల్లాను తమ స్థానిక జిల్లాగా ఎంచుకునేందుకు టీఎస్‌పీఎస్సీ చర్యలు చేపట్టనుంది. అలాగే నోటిఫికేషన్లో కూడా మార్పులు చేసి వారి రోస్టర్..రిజర్వేషన్ వివరాలతో సవరణగా మరొక నోటిఫికేషన్ జారీ చేయనుంది.

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: