Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Fri, Dec 15, 2017 | Last Updated 7:36 pm IST

Menu &Sections

Search

“సీఐఎస్ఎఫ్” లో “487” ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

“సీఐఎస్ఎఫ్” లో “487” ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
“సీఐఎస్ఎఫ్” లో “487” ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్).. 487 ఖాళీల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ ప్రకటన విడుదల చేసింది. ఈ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్..సుమారు ౩౦౦ ఇండస్ట్రీస్ ని కవర్ చేస్తూ ఉంటుంది..కేంద్ర ప్రభుత్వానికి సంభందించిన అనేక సంస్థలలో రక్షణకి గాను వీరిని ఉపయోగిస్తారు.ఇప్పుడు ఈ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ చేస్తున్న భార్తీలు ఇండియాలో అనేక ప్రాంతాల వారికి కూడా అవకాశాన్ని కలిపిస్తున్నాయి.

ap-politics-telangaana-politics-ap-political-updat

పోస్టు పేరు:  కానిస్టేబుల్/ఫైర్.

వేతనం:   రూ.21,700-రూ.69,100.

రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వారీ ఖాళీలు: 

ఆంధ్రప్రదేశ్-34; అరుణాచల్‌ప్రదేశ్-4; అసోం-28; బిహార్-69; ఛత్తీస్‌గఢ్-16; ఢిల్లీ-4; గుజరాత్-15; హర్యానా-6; హిమాచల్‌ప్రదేశ్-2; జమ్ముకశ్మీర్-12; జార్ఖండ్-28; కర్ణాటక-16; కేరళ-8; మధ్యప్రదేశ్-19; మహారాష్ట్ర-29; మణిపూర్-3; మేఘాలయ-3; మిజోరం-1; నాగాలాండ్-1; ఒడిశా-29; పంజాబ్-7; రాజస్థాన్-17; తమిళనాడు-17; తెలంగాణ-28; త్రిపుర-4; ఉత్తరప్రదేశ్-53; ఉత్తరాఖండ్-2; పశ్చిమబెంగాల్-32. వీటిలో 155 పోస్టులను ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని నక్సల్స్/తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలకు ప్రత్యేకంగా కేటాయించారు.
అర్హతలు:   సైన్స్ సబ్జెక్టుతో ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. 
వయసు:  దరఖాస్తు గడువు ముగిసేనాటికి 18-23 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీలకు సడలింపు ఉంటుంది. 
శారీరక ప్రమాణాలు: 

ఎత్తు-కనీసం 170 సెం.మీ.; ఛాతీ-కనీసం 80 సెం.మీ. (సాధారణం)-85 సెం.మీ. (గాలిపీల్చినపుడు); ఎస్టీ అభ్యర్థులైతే ఎత్తు-కనీసం 162.5 సెం.మీ., ఛాతీ-కనీసం 77 సెం.మీ. (సాధారణం)-82 సెం.మీ. (గాలిపీల్చినపుడు). అన్ని కేటగిరీల అభ్యర్థులకూ వారి ఎత్తు, వయసును బట్టి వైద్య ప్రమాణాలకు అనుగుణంగా బరువు ఉండాలి. 

ఆరోగ్య ప్రమాణాలు: 

నిబంధనల మేర తగిన శారీరక, మానసిక ఆరోగ్యం, దృష్టి సామర్థ్యం ఉండాలి. టాటూ (పచ్చబొట్లు) ఉండకూడదు. 
ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్(దేహ దారుఢ్య పరీక్ష): ఇందులో 5 కిలోమీటర్ల పరుగుపందెం నిర్వహిస్తారు. దీన్ని 24 నిమిషాల్లో పూర్తిచేయాలి.

ఎంపిక: ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (పీఎస్‌టీ), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ), రాతపరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్. 
రాతపరీక్ష: ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (పీఎస్‌టీ), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ)లో ఉత్తీర్ణులైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన అనంతరం రాతపరీక్ష (ఓఎంఆర్ ఆధారిత) నిర్వహిస్తారు. ఇందులో ఆబ్జెక్టివ్ విధానంలో 100 మార్కులకు 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నపత్రంలో జనరల్ అవేర్‌నెస్/జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, అనలిటికల్ ఆప్టిట్యూడ్, ఎబిలిటీ టు అబ్జర్వ్ అండ్ డిస్టింగ్విష్ ప్యాటర్స్న్‌తోపాటు ఇంగ్లిష్/హిందీ సామర్థ్యాన్ని పరీక్షించేలా ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి రెండు గంటలు. 

దరఖాస్తు ఫీజు: రూ. 100 (జనరల్/ఓబీసీ); ఎస్సీ/ఎస్టీ/మాజీ సైనికోద్యోగ కేటగిరీలకు ఫీజు లేదు.

దరఖాస్తు విధానం:  ఆన్‌లైన్.

దరఖాస్తుల ప్రారంభం:  డిసెంబర్ 11, 2017.

దరఖాస్తుకు చివరి తేదీ:  జనవరి 1, 2018.

పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్:  www.cisfrectt.in


ap-politics-telangaana-politics-ap-political-updat
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
"హెచ్‌1బీ"  వీసాదారులకి "గుడ్ న్యూస్"
తెలంగాణా ఆరోగ్యశాఖలో "521 సివిల్ అసిస్టెంట్ సర్జన్" పోస్టులు
"పసుపు వేసిన కొబ్బరి పాల" లాభాలు తెలిస్తే షాక్ అవుతారు
తెలంగాణా లో “2108 పారామెడికల్‌” ఉద్యోగాలకి నోటిఫికేషన్
కువైట్ లో రాయబారిగా "తెలుగు" వ్యక్తి
అమెరికాలో స్థిరపడాలి అనుకునే వారికి గుడ్ న్యూస్
 జుట్టు కుదుళ్ళు గట్టిపడటానికి..అద్భుతమైన చిట్కాలు
చెన్నై ”ఎన్ఐఆర్టీ”  లో “డేటా ఎంట్రీ”  పోస్టులు
భారతీయుడిపై దాడిని అడ్డుకున్న వ్యక్తి “హీరో”  అయ్యాడు
శనగపిండి తో సహజసిద్ద “ఫేస్ ప్యాక్”...లాభాలు తెలిస్తే షాకే
చలికాలంలో వాము నీళ్ళ ప్రయోజనాలు తెలిస్తే..తాగకుండా ఉండరు
భారత సంతతి మహిళకి అరుదైన గుర్తింపు
గుంటూరులో మెగా జాబ్ మేళా..