మాజీ సైనిక ఉద్యోగుల కొరకు ఇండియన్ బ్యాంక్ (ఐబీ) జాబుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.మొత్తం కాళీల సంఖ్య 64 ఖాళీల భర్తీకి మాజీ సైనికోద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది.ఈ మధ్య కాలంలో ఇండియన్ బ్యాంక్ నుంచీ ఒక్క ఉద్యోగ ప్రకటన కూడా రాలేదు అయితే ఇప్పుడు మాజీ సైనిక ఉద్యోగుల కోసం ఏర్పాటు చేశారు.

 indian bank కోసం చిత్ర ఫలితం

పోస్టు పేరు:  సెక్యూరిటీ గార్డ్ కమ్ ప్యూన్ (సబార్డినేట్ కేడర్).
రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వారీ ఖాళీలు: ఆంధ్రప్రదేశ్-4; అసోం-4; చంఢీగఢ్-2; గుజరాత్-3; కర్ణాటక-2; కేరళ-5; పుదుచ్చేరి-4; పంజాబ్-1; తమిళనాడు-34; తెలంగాణ-2; పశ్చిమ బెంగాల్-3. 

అర్హతలు:   పదోతరగతి/తత్సమాన విద్యలో ఉత్తీర్ణతతోపాటు ఇండియన్ ఆర్మీ/నేవీ/ఎయిర్ ఫోర్స్‌లో సైనికోద్యోగిగా పనిచేసి ఉండాలి. అలాగే దరఖాస్తు చేసుకునే రాష్ట్రం స్థానిక భాషలో పట్టు (రాయడం, చదవడం, మాట్లాడడం) ఉండాలి. వీటితోపాటు నిర్దేశిత శారీరక ప్రమాణాలు, తగిన ఆరోగ్యం తప్పనిసరి. 

వయసు: 2017, జూలై 31 నాటికి 18-45 ఏళ్ల లోపు ఉండాలి.
ఎంపిక:  ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ (పీఎఫ్‌టీ), రాతపరీక్ష. 
దేహ దారుఢ్య పరీక్ష: 

ఇందులో 5 మీటర్ల షటిల్-నిమిషానికి 11సార్లు పూర్తిచేయాలి. అలాగే నిర్దేశిత సమయానికి కనీసం 13 పుషప్స్, 20 సిటప్స్ తీయగలగాలి. 
రాతపరీక్ష విధానం:  ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులను రాతపరీక్షకు అనుమతిస్తారు. ప్రశ్నపత్రంలో.. స్థానిక భాషలో పరిజ్ఞానం, జనరల్ నాలెడ్జ్, సింపుల్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్, సెక్యూరిటీ అంశాల్లో పరిజ్ఞానం, బేసిక్స్ ఆఫ్ బ్యాంకింగ్ అనే ఐదు విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగం నుంచి 10 ప్రశ్నల చొప్పున మొత్తం 50 ప్రశ్నలు 100 మార్కులకు ఇస్తారు. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. 
దరఖాస్తు విధానం: వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు పత్రం డౌన్‌లోడ్ చేసుకొని అందులో వివరాలు నింపాలి. దానికి సంబంధిత ధ్రువపత్రాల నకళ్లు, ఫొటోలు తదితర అవసరమైన వాటిని జతచేసి కవరులో ఉంచి దరఖాస్తు చేసుకునే జోనల్ ఆఫీస్ కార్యాలయానికి గడువులోగా పంపాలి. 
దరఖాస్తులు చేరడానికి చివరి తేదీ: 

చివరికి డిసెంబర్ 30, 2017.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్:   www.indianbank.in


మరింత సమాచారం తెలుసుకోండి: