డిగ్రీలు చేతికి వచ్చి ఏళ్ళు గడుస్తున్నా సరే సరైన అవకాశాలు లేక ఖాళీగా ఉండలేక ఏవో చిన్న చిన్న పనులు చేస్తున్న వారికి గుంటూరు లో జిల్లా ఉపాది కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించనున్న జాబ్ మేళా ఎంతో ఉపయోగపడుతుంది అంటున్నారు. ఉపాధి అధికారి రజనీ ప్రియ. సుమారు 30 కంపెనీలలో ఉన్న వెయ్యి ఖాళీల భర్తీకి మెగా జాబ్‌ మేళాని నిర్వహిస్తున్నట్లుగా తెలుపుతున్నారు. ఈ నెల 12, 14 తేదీల్లో మెగా జాబ్‌ మేళా, అప్రంటిస్‌ మేళా నిర్వహిస్తారని.. 12వ తేదీ గుంటూరు మంగళదాస్‌ నగర్‌లోని  బెస్ట్‌ ప్రైజ్‌ ఎదురు గల సిమ్స్‌ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

 Image result for job mela

 

అయితే 14 వ తేదీన పిడుగురాళ్ల లోని నవీన డిగ్రీ కాలేజిలో నిర్వహిస్తున్నారు అని తెలిపారు..ఈ ఖాళీలకు పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీ, బి.టెక్‌, డిప్లొమా, ఐటీఐ, ఎంబీఏ, డి.ఫార్మసీ, బి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ, నర్సింగ్‌ అభ్యర్థులు అర్హులని వివరించారు. 18 నుంచి 32 ఏళ్ల మధ్య వయసు  ఉండాలన్నారు. సేల్స్‌ మేనేజర్‌, కస్టమర్‌ రిలేషన్‌ ఎగ్జిక్యూటివ్‌, నర్సులు, ఫార్మసిస్టులు, టెక్నిషన్స్‌, అకౌంటెంట్‌, సాఫ్ట్‌వేర్‌ డెవ లపర్స్‌, సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌, షోరూం సేల్స్‌, సెక్యూరిటీ గార్డ్స్‌ తదితర ఉద్యోగాల భర్తీ జరుగుతుందన్నారు.

 

నిరుద్యోగులు అందరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని..ఏపీలో ఉన్న అనేక కంపనీలు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాన్ని ఇవ్వడానికి ముందుకు వచ్చాయని అన్నారు. అయితే ఈ విషయంలో ఎటువంటి సందేహాలు..ఇతర విషయాలకోసం ఫోన్‌ నెం: 0863-2350060 సూచించారు. ఈ జాబ్‌మేళా, అప్రంటిస్‌ మేళాకు హాజరయ్యేవారు విద్యార్హత ధ్రువీకరణ పత్రాలతో పాటు  ఆధార్ కార్డ్ కూడా తీసుకుని రావాలని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: