మనిషి ఈ మద్య కాలంలో తిండి విషయంలో ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నా.. ఒక దశలో బరువు పెరిగిపోతున్నారు. ముఖ్యంగా   బయట తినే జంగ్ ఫుడ్స్ లో ఆయిల్ శాతం అధికంగా ఉండటం చేత బరువులో వ్యత్యాసం వస్తుంది. ఇక బరువు తగ్గించుకోవడానికి జిమ్ కు వెళ్లడం, యోగా చేయడం నానా రకాల బాధలు పడుతుంటారు.  బరువు తగ్గటానికి ప్రయత్నించే వారిలో కొంత మంది ఆకలికి తట్టుకోలేక నియమాలను అతిక్రమించి ఆహర సేకరణను అధికం చేసి, బరువు తగ్గటంలో వైఫల్యాలను ఎదుర్కొంటారు. అయితే బరువు తగ్గించుకునేందుకు సులువైన మార్గాలు చాలా ఉన్నాయి ముఖ్యంగా మనం తినే ఆహారం పదార్థాలతో బరువు తగ్గించుకోవచ్చు. 


అధిక బరువు తో అవస్థలు


గ్రీన్ టీ : బరువు తగ్గటానికి గ్రీన్ టీ ఒక అద్బుతమైన ఎంపిక అని చెప్పవచ్చు. గ్రీన్ టీ 'పాలీ ఫినాల్స్'లను కలిగి ఉండి మన శరీరంలో ఉండే ట్రై-గ్లిసరైడ్స్'లను విచ్చిన్న పరుస్తుంది. అంతేకాకుండా, వ్యాయామాలు చేయటం వలన బరువు తగ్గటానికి కావలసిన సహనాన్ని పెంచుతుంది. ప్రతి సారి కప్పు గ్రీన్ తాగినపుడల్లా మీరు మంచి భావనను పొందుతారు.  


బ్రోకలీ : బ్రోకలీ అనేది అద్బుతమైన, ఆరోగ్యాన్ని పెంపొందించే ఆహరం మరియు ప్రఖ్యాతి గాంచిన క్యాన్సర్ కారకాలకు వ్యతిరేకంగా పనిచేసే గుణాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఎక్కువ మొత్తంలో ఫైబర్ స్థాయిలను కలిగి ఉండి బరువు తగ్గటానికి సహాయపడుతుంది.  


నారింజ పండు: బరువు తగ్గించుటలో సహాయపడే మరొక అద్బుతమైన ఆహరంగా నారింజ పండును చెప్పవచ్చు. ఎక్కువ క్యాలోరీలను అందించే డిషెస్'లకి బదులగా నారింజ పండ్లను తినటం మంచిది. నారింజ పండులో అధిక మొత్తంలో ఫైబర్ మరియు విటమిన్ 'C'లను కలిగి ఉండి, జీవక్రియ రేటును పెంచి ఆకలి అనిపించకుండానే శరీర బరువు తగ్గిస్తాయి.


క్యాబేజీ : క్యాబేజీని మీ ఆహర ప్రణాళికలో కలుపుకోవటం వలన ఆకలి తగ్గుతుంది. ఇది మీ శరీర అధిక బరువును తగ్గించటంలో సహాయపడటమే కాకుండా, అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్'లను, విటమిన్ 'C' కలిగి ఉండి, జీవక్రియ రేటును మెరుగుపరచి, శరీర రోగనిరోధక వ్యవస్థ శక్తిని పెంచుతుంది. 

రాడిషేస్ : రాడిషేస్ జీర్ణక్రియలో వచ్చే సమస్యలను త్రోలగించే పొటాషియం, ఫోలిక్ ఆసిడ్, యాంటీ ఆక్సిడెంట్ మరియు సల్ఫర్ వంటి పోషకాలను కలిగి ఉంటుంది. తరచుగా రాడిషేస్'లను తీసుకోవటం వలన మీ జీర్ణక్రియ స్థాయిలను పెంచి, బరువు పెరుగుదలను అరికడుతుంది.


ద్రాక్ష పండ్లు : ఇది చాలా ఆరోగ్యవంతమైన ఆహరంగా చెప్పవచ్చు, ద్రాక్ష పండ్లు విటమిన్ 'C', ఫోలిక్ ఆసిడ్'లతో పాటూ, పెక్టిన్ మరియు కరిగే ఫైబర్'లను కలిగి ఉంటుంది. ద్రాక్షలు మీ ఆరోగ్యాన్ని ప్రభావిత పరచకుండా, మీ శరీర బరువును మాత్రమె తగ్గిస్తాయి. 


మంచినీరు : ఈ విషయం చాల మందిని ఆశ్చర్యానికి గురి చేయవచ్చు, కానీ ఇది నిజం. నీరు వలన శరీరంలోని ఎక్కువ పౌండ్స్'లను కోల్పోయేలా చేస్తుంది. స్త్రీలలో ఎవరైతే నీటి శాతం అధికంగా ఉన్న ఆహర పదార్థాలను ఎక్కువగా తీసుకుంటారో, వారి  బాడీ మాస్ ఇండెక్స్ తక్కువగా ఉంటుందని 'యూనివర్సిటీ అఫ్ టోక్యో' వారు కనుగొన్నారు. ఇవి మీ ఆకలిని ప్రత్యామ్నాయ పరచవు కానీ నీరు మాత్రం మీ ఆకలిని తీరుస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: