మనం ఇష్టంతో తినే పండ్లలో పనస పండు ఒకటి.   పనస మల్బరీ కుటుంబానికి చెందిన చెట్టు. తూర్పు ఆసియా దీని జన్మస్థలం. ప్రపంచంలోనే అతి పెద్ద పండును ఇచ్చే చెట్టు ఇదే. దాదాపు ఒక్కోటి 36 కేజీలుంటుంది. 90 సెంటీమీటర్ల పొడవు, 50 సెంటీమీటర్ల వ్యాసం కలిగి ఉంటాయి.  ఈ పనస పండు తియ్యగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.  తేమ, పిండి పదార్థాలు, మాంసకృత్తులు, క్రొవ్వు, ఇనుము, విటమిన్ ఏ, సీ లు కలిగి ఉన్న పనస పండును తిన్నట్లయితే శరీరానికి 540 క్యాలెరీల శక్తి అందుతుంది.


ఈ పండులో లభించే ఫైటో న్యూట్రియంట్‌లు క్యాన్సర్ నుంచే కాకుండా హైపర్ టెన్షన్‌ను తగ్గించటంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.ఆస్తమాతో బాధపడేవారికి పనసపండు మంచి ఉపయోగకారి. పనస వేరును ఉడికించి, దాన్నుంచి వచ్చే రసాన్ని ప్రతిరోజూ తీసుకున్నట్లయితే ఆస్తమా అదుపులో ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. జీర్ణ శక్తిని మెరుగు పరచును , జారుడు గుణము కలిగివున్నందున మలబద్దకం నివారించును , పొటాసియం ఎక్కువగా ఉన్నందున రక్తపోటు ను తగ్గించును , విటమిన్ సి ఉన్నందున వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరచును .

పనస చెట్టు

పొటాషియం మెండుగా లభించడం వల్ల అది రక్తపోటును తగ్గిస్తుంది. పనస ఆకులు, మొక్క జొన్న, కొబ్బరి చిప్పలను కాల్చి చేసిన పొడి పుండ్లను నయం చేయడానికి ఉపయోగిస్తారు. పనస ఆకులను వేడి చేసి గాయాల మీద పెట్టుకుంటే త్వరగా ఉపశమనం లభిస్తుంది. చర్మవ్యాధులు, ఆస్తమా, జ్వరం, డయేరియా నివారణకు పనస వేర్లు ఉపయోగపడతాయి. అధిక బరువును, టెన్షన్‌ను, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. అజీర్ణం, పాండు వ్యాధి, నంజు, కడుపునెప్పి, అగ్నిమాంధ్యం, క్షయ, శుక్ర నష్టం, అండవాతం మొదలైన వ్యాధులున్నవారు పనసపండును తినరాదు. చెట్టున పండిన కాయను, కోసిన వెంటనే తింటే, అదంత రుచికరంగా ఉండదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: