ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా జికా వైర‌స్‌ గురించి భయాందోళనలు మొదలయ్యాయి. ప్రాణాంతకరంగా మారిన ఈ వైరస్ భారిన ఇప్పటికే చాలా మంది నరకం అనుభవిస్తున్నారు. గర్భంతో ఉన్న మహిళలకు జికా వైరస్‌ సోకితే చిన్నారులు తల తక్కువ పరిమాణంతో, మెదడు సంబంధ లోపాలతో జన్మిస్తున్నారు. ఈ వైరస్‌ దోమల ద్వారా కూడా వ్యాపిస్తుంది. వైరస్‌ సోకిన వారితో లైంగికచర్య ద్వారా కూడా జికా వైరస్‌ సోకుతుందని తాజాగా టెక్సాస్‌ ఆరోగ్య విభాగం స్పష్టం చేసింది.  

 ఇప్ప‌టికే 20కి పైగా లాటిన్ అమెరికా దేశాల్లో జికా విజృంభిస్తున్న నేప‌థ్యంలో, గ‌ర్భంలో ఉండ‌గానే ఇది పిల్ల‌ల‌పై ప్ర‌భావం చూపుతుంద‌ని తేల‌డంతో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ అత్యవ‌స‌ర చ‌ర్య‌లకై  పిలుపునిచ్చిన‌ సంగ‌తి తెలిసిందే.  మరోవైపు  ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాలా దేశాలు జికా వైర‌స్‌కి వ్యాక్సిన్ క‌నిపెట్టే ప్ర‌య‌త్నాల్లో ఉండ‌గా హైద‌రాబాద్‌కి చెందిన ఒక బ‌యోటెక్ కంపెనీ దాన్ని సాధించింది. రెండున్నరేళ్లుగా జికా వైరస్ నిరోధక వ్యాక్సిన్‌పై పరిశోధనలు చేస్తున్నట్లు భారత్ బయోటెక్ వెల్లడించింది.


జికా వైరస్


 డబ్ల్యూహెచ్‌వో, ప్రభుత్వ అనుమతితో ఈ వ్యాక్సిన్ వినియోగంలోకి రావడానికి రెండున్నరేళ్ల సమయం పడుతుందని ప్రకటించింది. ఇక రెండున్నరేళ్లుగా చేస్తున్న పరిశోధనల్లో ఫలితాలు కనిపించాయన్నారు. ప్రయోగశాల పరిశోధనల్లోనూ వ్యాక్సిన్‌తో జికా వైరస్‌ను నిరోధించగలిగామని స్పష్టం చేసింది. భార‌త్ బ‌యోటెక్ ఇంట‌ర్నేష‌న‌ల్ లిమిటెడ్‌ అనే కంపెనీ తాము జికా వైర‌స్‌కి వ్యాక్సిన్ క‌నిపెట్టి, పేటేంట్ కోసం అప్ల‌యి చేశామ‌ని  ప్ర‌క‌టించింది.  త్వరలో జికా వ్యాక్ పేరుతో వ్యాక్సినేషన్‌ను అందుబాటులోకి తెస్తామని పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: