మనం రోజూ ఇంట్లో వంటల్లో మెంతులు వాడుతుంటాం..ముఖ్యంగా మెంతి కూర అంటే ప్రతి వంట్లో తప్పని సరిగా వాడుతుంటాం. నాన్ వెజ్ అయితే మెంతి కూర తప్పకుండా ఉండాల్సిందే. అయితే ఈ మెంతుల్లో అద్భుతమైన ఔషదాలు దాగి ఉన్నాయని పురాణాల్లో చెబుతుంటారు. ప్రోటీన్, విటమిన్ ‘C’, నియాసిన్, పొటాషియం వంటి ముఖ్య మూలకాలను కలిగి ఉండే మెంతి విత్తనాల వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి ఈ లింక్ లో తెలుపబడింది.


 అద్భుత ఔషదంగా పేర్కొనే మెంతి విత్తనాలు ప్రోటీన్, విటమిన్ ‘C’, నియాసిన్, పొటాషియం వంటి మూలకాలను కలిగి ఉండి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అద్భుతమైన ఔషద గుణాలను కలిగి ఉండే మెంతుల వలన కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ పేర్కొనబడింది.


జ్వరం : నిమ్మ మరియు తేనెతో కలిపి మెంతి విత్తనాలను తీసుకోవటం వలన జ్వరం తగ్గుతుంది. జ్వరంగా ఉన్న సమయంలో ఈ ఔషదాన్ని తీసుకోవటం వలన శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తుంది. జ్వరం తగ్గటానికి గానూ, రోజు మూడు సార్లు రెండు చెంచాల మెంతులను నిమ్మ మరియు తేనె కలిపి తీసుకోండి.


గుండె సంబంధిత వ్యాధులు : మెంతులలో ఉండే గ్లాక్టోమాన్నన్ ఉండటం వలన గుండెపోటు కలగకుండా చూస్తుంది. అంతేకాకుండా, పుష్కలంగా పొటాషియంను కలిగి ఉండి చర్యలను అడ్డుకోవటం ద్వారా గుండె సంబధిత వ్యాధులను మరియు రక్తపీడనాన్ని తగ్గిస్తుంది.


చర్మ ఇన్ఫెక్షన్ :  కాలిన గాయాలు, తామర, చీము పట్టిన గడ్డల వంటి చర్మ ఇన్ఫెక్షన్ ల నుండి ఉపశమనం కలిగించుటలో మెంతులు చాలా శక్తివంతమైన ఔషదంగా పేర్కొనవచ్చు. ఒక చెంచా మెంతులను రుబ్బి, వేడి నీటిలో కలపండి. ఈ మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతాలలో అప్లై చేయండి.


శరీర కొవ్వు పదార్థాల తగ్గుదల : శరీరంలో కొవ్వు పదార్థాల నిర్వహణకు గానూ మెంతులను వాడమని సిఫార్సు చేయవచ్చు. ప్రతిరోజు రెండు ఔన్ల మెంతులను తీసుకోవటం వలన శరీరంలో కొవ్వు పదార్థాలు తగ్గి, గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉంటారని వివిధ రకాల పరిశోధనలలో తెలుపబడింది.


మరింత సమాచారం తెలుసుకోండి: