సాధారణంగా మనిషి శరీర తత్వం వాతావరణంలోని ఉష్ణోగ్రతను బట్టి కూడా మారుతుంది. చలికాలంలో పొడిగా,వేసవి కాలంలో చెమటు పడుతూ జిడ్డుగా  మారుతుంది. అయితే శరీర తాపం అంటే శరీరంలోని వేడి రావటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. మీరు వేసవికాలంలో చాలా ఈ సమస్యలకు గురి అవుతారు. ఎందుకంటే వేసవిలో మీ శరీరం సూర్య కిరణాల తాకిడికి లోను అవుతుంది. ఇంకో కారణం మీరు తీసుకునే ఆహారం ఉదా. స్పైసీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఆల్కహాల్, కెఫ్ఫిన్ ఇలాంటి వాటి వల్ల శరీరం వేడికి గురి అవుతుంది. అంతేకాక జబ్బులు, మందులు కూడా శరీరంలో వేడి పెరగటానికి కారణాలవుతాయి. మామూలు మానవ శరీర ఉష్ణోగ్రత 36.9.సి. అయితే వాతావరణ మార్పులను బట్టి కొంచెం అటూ ఇటూ అవ్వటం సాధారణమే. కానీ ఈ ఉష్ణోగ్రత కంటే ఏ మానవుని శరీరం హెచ్చుతగ్గులకు గురి అవటం ప్రమాదకరం. 


శరీరంలో వేడి తాపాన్ని తగ్గించుకోవాలంటే ఇలా చేయాలి :


మన ఇంట్లో ప్రతి ఆహారం లో భాగమే ఇది. ఈ మెంతులు అధిక వేడిని తీసివేసి శరీరాన్ని మాములు స్థితికి తెస్తాయి. ఒక టేబుల్ స్పూన్ మెంతుల్ని తీసుకుని తింటే చాలా మంచిది.


తేనె, పాలు కలిపి తగితే చాలా మంచిది. ఒక చల్లని పాలల్లో ఒక టేబుల్ స్పూన్ తేనె వేసుకుని త్రగటం వల్ల శరీరంలోని వేడి పోతుంది. ఇలా రోజూ చేయటం ఎంతో మంచిది.


బిగుతుగా ఉండే దుస్తులు ధరించటం, ఈ దుస్తులు వేడిని కలిగించటం చాలా వరకు వదులు దుస్తులు దరిస్తే మంచిది. 


వేడి ప్రాంతాలకు దూరంగా ఉండాలి, స్పైసీ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి.


కొవ్వు పదార్ధాలను అలాగే వేపుని పదార్ధాలకు దూరంగా ఉండాలి.


తక్కువ సోడియం కలిగిన పదార్ధాలను తింటే మంచిది.


కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనె లను వాడండి. వంటలలొ కూడా వేరుశనగ నూనె వంటివి మానేయ్యాలి


రోజూ ఆహారంలో నట్స్ ఉపయొగించవద్దు. వారానికి 2-3 సార్లు మాత్రమే వాడాలి.


దాదాపు శాఖాహార భోజనాన్నే వాడండి. మాంసాన్ని తక్కువగా వాడితే మంచిది. అదీ రెడ్ మట్టన్ వాడకాన్ని మానేయ్యాలి.


గసగసాలు శరీరంలోని వేడిని తొలగిస్తాయి. కాకపోతే వీటిని మోతాదుకు మించి తీసుకోరాదు. అలాగే పిల్లలకు కూడా ఎక్కవగా ఇవ్వరాదు.


రోజూ ఉదయాన్నే దానిమా జ్యూస్ ఒక గ్లాస్ తాగండి. అలాగే ఈ జ్యూస్ లో ఆల్మండ్ ఆయిల్ కొన్ని చుక్కలు వేసుకుని త్రాగటం ఎన్తో మంచిది.


మరింత సమాచారం తెలుసుకోండి: