మనిషి నిత్యం ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటారు.  సాధారణంగా మనిషి యాంత్రిక జీవితానికి అలవాటు పడి తన ఆరోగ్యం గురించి పట్టించుకోవడం మానేశాడు.ఒక వేళా ఆరోగ్యం గురించి శ్రద్ద చూపించినా నామ మాత్రంగా వ్యాయామం, యోగా లాంటి చేస్తున్నారు.  మన శరీరం తనలో ఉన్న జబ్బులను బయటపెట్టడానికి నొప్పుల రూపంలో చూపిస్తుంది. ఈ నొప్పిని తగ్గించడానికి ఏదో ఆయింట్‌మెంట్ లేక నొప్పి తగ్గించే జెల్ వంటివి వాడుతుంటారు కానీ ఇవి తాత్కలికంగానే ఉపశమనాన్ని అందిస్తాయి. నడుము నొప్పి నుంచి పూర్తి ఉపశమనం మన ఇంట్లో లభించే కొన్న ఔషదాలతోనే తగ్గించుకోవచ్చు.

నడుం నొప్పనుంచి ఉపశమనం కలగడానికి కొన్ని చిట్కాలు మీకోసం.. 

 
విపరీతమైన నడుమునొప్పి వచ్చినప్పుడు రెండు రోజులపాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. 


నొప్పి తీవ్రమైనపుడు ఐస్‌ప్యాక్ ఉంచాలి ఆతర్వాత హాట్ ప్యాక్ ఉంచాలి, నొప్పి అలాగే ఉంటే అరగంట తర్వాత మళ్ళీ ఐస్‌ప్యాక్, హాట్‌ప్యాక్ ఉంచాలి.


చెస్ట్ (రొమ్ము), కాళ్ళ క్రింద దిండ్లు పెట్టుకుని బోర్లాపడుకోవాలి.


వేడినీళ్ళలో తువ్వాలు ముంచి నొప్పి ఉన్నచోట తాపడం పెట్టాలి.


కొబ్బరినూనెలో కర్పూరం కలిపి కాచిన తర్వాత ఆనూనెను నొప్పిఉన్న చోట పూయాలి.


అల్లం, తెల్లగడ్డలు దంచుకుని కొబ్బరినూనెలో మరగనిచ్చిన నూనె నొప్పిఉన్నచోట పూసిన తర్వాత హాట్ ప్యాక్ ఉంచాలి.


 చిన్న ముక్కలుగా తరిగిన అల్లాన్ని రెండు కప్పుల నీళ్ళలో వేసి అవి ఒక కప్పు అయ్యే వరకు మరిగించాలి. ఈ నీటిని వడగట్టి చల్లారిన తర్వాత దీనిలో తేనే కలుపుకొని తాగితే నడుము నొప్పి తగ్గిపోతుంది.


అల్లం పెస్ట్‌ను నొప్పి ఉన్న చోట కాసేపు పెట్టి కడిగేసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. అల్లంలోని యాంటి ఇన్‌ఫ్లమేటరీ గుణాలు నొప్పి తగ్గడానికి దోహదం చేస్తాయి. 


నడుము నొప్పిగా ఉన్న భాగంలో ఐస్‌తో కాపడం పెట్టుకోవడం ద్వారా కూడా నొప్పి తగ్గుతుంది. అయితే నొప్పి పూర్తిగా తగ్గే వరకు ప్రతి అరగంటకోసారి ఇలా చేస్తుండాలి


తులసి ఆకులను ఒక కప్పు నీటిలో వేసి అవి అరకప్పు అయ్యే వరకు మరిగించి ఆ నీటిలో ఉప్పు వేసుకొని తాగితే నొప్పి తగ్గు ముఖం పడుతుంది. 


తెల్లచామంతితో చేసిన కషాయం కూడా నడుము నొప్పికి మంచి మందుగా పనిచేస్తుంది. 


ఒక కప్పు పాలలో రోజు తేనె వేసుకొని రోజు తాగడం వల్ల కూడా నడుము నొప్పి రాకుండా ఉంటుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: