సాధారణంగా మనం తినే పదార్థాల్లో ఏమాత్రం తేడా ఉన్న అది వెంటనే గొంతుపై నాలుకపై ప్రభావం చూపిస్తుంది. గొంతులో గర గర లాడటం..నొప్పివేయడం లాంటి జరుగుతుంది. ఎక్కువ చల్లదనం ఉన్న పదార్థాలు, ద్రవపదార్థాలు తిన్నా,తాగినా ఇలాంటి ఇబ్బంది వస్తుంది. లేదా ఎక్కవ కారం ఉన్న, మసాలా పదార్థాలు ఉన్నవి తీసుకున్నా గొంతుపై ప్రభావం చూపిస్తుంది. 


ప్రతి ఇంట్లో పసుపు తప్పకుండా ఉంటుంది. దీనిలో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఎక్కువ. గొంతులో మంట విపరీతంగా ఉంటే.. పాలల్లో చిటికెడు పసుపు వేసుకొని తాగాలి. 


దాల్చిన చెక్క నూనెలో తేనె కలిపి తాగితే తక్షణ ఉపశమనం కలుగుతుంది. వీలైతే వేడినీటిలో తేనె కలిపి పుక్కిలించినా మంచిదే.
 
వెల్లుల్లిలో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ సెప్టిక్ గుణాలు అధికం. 


వేడివేడి అన్నంలో వెల్లుల్లి, ఉప్పు, కారం కలిపి తింటే మంచిది.


గ్లాసు నీళ్లల్లో దాల్చిన చెక్క, మిరియాల పొడి, కలిపి పుక్కిలించాలి. ఇలా రోజుకు మూడుసార్లు చేయాలి. అంతే గొంతులోని గరగర మటుమాయమవుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: