ఈ మద్య మనం తింటున్న తిండిలో అన్ని కలుషిత పదార్థాలు చేరుతున్నాయి..దీంతో కడుపులో మంట..అజీర్తి..గ్యాస్ నొప్పి లాంటివి రావడం జరుగుతుంది. ఇలా గ్యాస్ట్రీక్ వల్ల కడుపు ఉబ్బరంగా ఉండటం..నొప్పి లేవడం రక రకాల ఇబ్బందులు తలెత్తుతుంటాయి.  గ్యాస్ నొప్పి అనేది  ప్రతి ఒక్కరికి అనుభవంలోకి వచ్చే ఒక సాదారణ విషయం. గ్యాస్ నొప్పి ఎక్కువ అయినప్పుడు గుండె నొప్పి అని తప్పుడు సంకేతాలను ఇస్తుంది. కొన్ని సార్లు మనం తీసుకొనే ఆహారం ద్వారా గ్యాస్ ఏర్పడి మలబద్ధకం లేదా అతిసారంనకు దారితీస్తుంది. అందువల్ల ఇప్పుడు గ్యాస్ నొప్పి లక్షణాలు, కారణాలు మరియు ఇంటి నివారణల గురించి తెలుసుకుందాం. గ్యాస్ నొప్పిని కొన్ని సార్లు గుండె నొప్పిగా భావించవచ్చు. అది ఉదర ప్రాంతంలో ఏర్పడే గ్యాస్ కారణంగా అన్పిస్తుంది.* చిన్న ప్రేగులలో జీర్ణము చెయ్యబడని కార్బోహైడ్రేట్ల కారణంగా గ్యాస్ ఏర్పడుతుంది.


 గ్యాస్ నొప్పి కారణాలు :

అత్యధిక ఫైబర్ ఆహారాలు మరియు ఆరోగ్యకరమైన ఆహారాలు జీర్ణం కాకపోవటం వలన గ్యాస్ ఏర్పడుతుంది.


ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించటానికి,రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించటానికి, విషాలను తొలగించటానికి సహాయపడుతుంది. అయితే ఫైబర్ గ్యాస్ ఏర్పడటానికి కూడా కారణం అవుతుంది.


గ్యాస్ మరియు నొప్పిని కలిగించే అత్యధిక ఫైబర్ కూరగాయలు, పండ్లు, బీన్స్, బఠానీలు, తృణధాన్యాల వంటి ఆహారాల్లో ఉంటుంది.


 అధిక ఫైబర్ సప్లిమెంట్స్ సైలియం వంటి సమస్యలకు కారణం అవుతుంది.


 బీర్ లేదా సోడా వంటి కార్బోనేటేడ్ పానీయాలు కూడా  గ్యాస్ గా మారతాయి.


 కడుపు ఉబ్బరం కారణంగా మలబద్దకం ఏర్పడుతుంది. 


చాలా మందిలో గ్యాస్ నొప్పి లక్షణాలు :

 గ్యాస్ అసంకల్పితంగా బయటకు రావటం


త్రేనుపు రావటం.. ఉదర ప్రాంతంలో తీక్షణమైన నొప్పులు రావటం


చాతీ ప్రాంతంలో నొప్పి రావటం


నొప్పి ఉదర భాగంలో సంభవించిన పక్కకు కూడా మారవచ్చు.


ఉదరం వాపు లేదా బిగుతుగా ఉండటం, ఆకలి లేకపోవటం


గ్యాస్ నొప్పికి ఇంటి చిట్కాలు :

 
గ్యాస్ నొప్పి ఉన్నప్పుడు చాలా అసౌకర్యంగా ఉంటుంది. అందువల్ల ఆ సమయంలో కింద పడుకోవాలి. ఆ విధంగా కొంత సమయం విశ్రాంతి తీసుకుంటే అసౌకర్యం తగ్గుతుంది.


జీర్ణక్రియ సరిగ్గా లేకపోవుట వలన గ్యాస్ వస్తుంది. ద్రవాలను ఎక్కువగా తీసుకుంటే జీర్ణం కానీ ఆహారాలను తరలించటానికి సహాయపడుతుంది. ద్రవాలు ఎక్కువగా తీసుకోవటం వలన మలబద్ధకం తగ్గి తద్వారా గ్యాస్ బయటకు పోతుంది.


గ్యాస్ ఉన్నప్పుడు తప్పనిసరిగా కార్బోనేటేడ్ పానీయాలను నివారించాలి. కార్బోనేటేడ్ పానీయాల కారణంగా గ్యాస్ ఏర్పడి అసౌకర్యం కలుగుతుంది. ఈ గ్యాస్ కారణంగా చాతీ నొప్పి వస్తుంది. ఈ పానీయాల్లో కేలరీలు ఉండవు. అందువల్ల వాటిలో అనవసరమైన చక్కెరలను కలుపుతారు.


ఆవాలు గ్యాస్ ని తగ్గించటంలో చాలా బాగా సహాయపడుతుంది. అవాలును తరచుగా వంటల్లో ఉపయోగిస్తే గ్యాస్ రాకుండా నిరోదిస్తుంది. అలాగే యాలకులు,జీలకర్ర, పసుపు వంటి భారతీయ సుగంధ ద్రవ్యాలలో ఉండే లక్షణాలు జీర్ణక్రియలో సహాయపడతాయి. పొట్ట ఉబ్బరాన్ని తగ్గించి గ్యాస్ రాకుండా ఉండటానికి వీటిని కూరల్లో వాడవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: